కాంగ్రెస్ ఏక్‌నాథ్ షిండే పొంగులేటి: కేఏ పాల్‌

తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏక్‌నాథ్ షిండే లాంటి వాడ‌ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలీలో హాట్ కామెంట్లు చేశారు

కాంగ్రెస్ ఏక్‌నాథ్ షిండే పొంగులేటి: కేఏ పాల్‌

విధాత : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏక్‌నాథ్ షిండే లాంటి వాడ‌ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలీలో హాట్ కామెంట్లు చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ క్షణంలోనైనా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం లేకపోలేదంటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్గత ఆధిపత్య కలహాలతో అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వ్యాఖ్యానించారు. రైతుబంధు డబ్బులు రూ.5 వేల కోట్లు పొంగులేటి తన ఖాతాలో వేసుకున్నాడని పాల్ మరోసారి ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్‌లో బాబుమోహన్‌ను గెలిపించాలని కోరారు. ఏపీ, తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ బలం పెరుగుతుందన్నారు.