Kajal-Sreeleela Dance | బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కాజల్‌, శ్రీలీల.. వీడియో వైరల్‌

Kajal-Sreeleela | నందమూరి బాలకృష్ణ నటించిన ఓ సినిమాలోని పాటకు టాలీవుడ్‌ బ్యూటీలు కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల స్టెప్పులేశారు. భగవంత్ కేసరి మూవీ సెట్స్‌ ఇందుకు వేదికైంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది. డైరెక్టర్ అనిల్ రావిపూడిని టీజ్ చేస్తూ కాజల్‌, శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టారు. వీడియో ప్రకారం.. తొలుత డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ‘బాలయ్య బాలయ్య’ పాటకు స్టెప్పులేస్తాడు. ఆ తర్వాత కాజల్, శ్రీలీల అనిల్‌ను సీరియస్ గా […]

Kajal-Sreeleela Dance | బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన కాజల్‌, శ్రీలీల.. వీడియో వైరల్‌

Kajal-Sreeleela | నందమూరి బాలకృష్ణ నటించిన ఓ సినిమాలోని పాటకు టాలీవుడ్‌ బ్యూటీలు కాజల్‌ అగర్వాల్‌, శ్రీలీల స్టెప్పులేశారు. భగవంత్ కేసరి మూవీ సెట్స్‌ ఇందుకు వేదికైంది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌గా మారింది. డైరెక్టర్ అనిల్ రావిపూడిని టీజ్ చేస్తూ కాజల్‌, శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టారు. వీడియో ప్రకారం.. తొలుత డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ‘బాలయ్య బాలయ్య’ పాటకు స్టెప్పులేస్తాడు. ఆ తర్వాత కాజల్, శ్రీలీల అనిల్‌ను సీరియస్ గా చూస్తుండగా అతనేదో చెప్పబోతాడు. కానీ, స్టార్ట్ మ్యూజిక్ అంటూ కాజల్, శ్రీలీల అరుస్తారు. వెంటనే ‘రారా ఉల్లాసవీరుడా’ పాట ప్లే కాగానే ఇద్దరు డ్యాన్స్ చేస్తారు.

డెనిమ్ జీన్స్, పింక్ టాప్స్‌లో కాజల్, శ్రీలీల మెరిసిపోయారు. స్టెప్స్‌ సైతం అదరహో అనే రేంజ్‌లో ఉన్నాయి. గత నెలలో అనిల్ రావిపూడి కొరియోగ్రాఫర్ భాను, స్టంట్ డైరెక్టర్ వెంకట్ మాస్టర్‌ కలిసి బాలయ్య పాటకు స్టెప్పులేశాడు. ఆ వీడియోను మొదట్లో చూపిస్తూ తర్వాత కాజల్, శ్రీలీల మూమెంట్స్‌ను చూపించారు. మరో వైపు భగవంత్‌ కేసరి సెట్‌లో కాజల్‌ బర్త్‌ డే సెలబ్రేషన్‌ ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫొటోను సైతం చిత్రబృందం ట్వీట్‌ చేసింది. చిత్రబృందం సమక్షంలోనే కాజల్ కేక్ కట్ చేసింది. ఇదిలా ఉండగా.. భగవంత్‌ కేసరి చిత్రంలో కాజల్‌ బాలయ్య సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీల మరో పాత్ర పోషిస్తున్నది. బాలకృష్ణకు 108 సినిమా కావడం విశేషం. ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్ వహిస్తున్నారు.