రాజకీయాల్లోకి కంగనా.. అక్కడి నుంచి పోటీకి సిద్ధం
Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. రాజకీయాల్లోకి వస్తున్నారా? హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఆమె మాటలు వింటుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇటీవల ఓ చర్చా వేదికపై మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే తాను ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాట బయటపెట్టింది. తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తాను. మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, బీజేపీ కోరుకుంటే.. ఆ […]

Kangana Ranaut | బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. రాజకీయాల్లోకి వస్తున్నారా? హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఆమె మాటలు వింటుంటే అది నిజమే అనిపిస్తోంది. ఇటీవల ఓ చర్చా వేదికపై మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే తాను ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాట బయటపెట్టింది.
తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తాను. మరీ ముఖ్యంగా మండీ ప్రాంత ప్రజలు, బీజేపీ కోరుకుంటే.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ దేశంలో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని కంగనా పేర్కొన్నారు. ప్రతి భారతీయుడిలో జాతీయభావం కనిపిస్తుందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ విధానాలను అనుసరించే కుటుంబం నుంచి వచ్చాను. కానీ మోదీ పనితీరుతో ఇప్పుడు తమ కుుటుంబం బీజేపీ పక్షాన నిలిచిందన్నారు. రాహుల్ గాంధీ.. మోదీకి పోటీదారు కాదన్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించే ఉచితాలు హిమాచల్ ప్రదేశ్ లో పని చేయవని కంగనా స్పష్టం చేశారు.