Karimnagar | బిజిగిరి షరీఫ్ జాతరలో అపశృతి.. కోనేరులో మునిగి ఇద్దరు యువకులు మృతి

Karimnagar విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ ఉర్స్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. గుట్టపై ఉన్న కోనేరులో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీజిగిరి షరీఫ్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం బక్రీద్ సందర్భంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఉత్సవాలలో పాల్గొనేందుకు గోదావరిఖనికి […]

Karimnagar | బిజిగిరి షరీఫ్ జాతరలో అపశృతి.. కోనేరులో మునిగి ఇద్దరు యువకులు మృతి

Karimnagar

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ ఉర్స్ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. గుట్టపై ఉన్న కోనేరులో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

బీజిగిరి షరీఫ్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం బక్రీద్ సందర్భంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఉత్సవాలలో పాల్గొనేందుకు గోదావరిఖనికి పన్నెండు మంది యువకులు వచ్చారు.

వీరంతా కోనేరులో స్నానానికి వెళ్ళారు. ఇందులో పది మంది యువకులు బయటికి రాగ మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. గతంలో ఇదే కోనేరులో ప్రమాదాలు జరిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. దీంతో అధికారుల నిర్లక్యం వ‌ల్లే ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం అవుతున్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.