Karnataka | ష‌ర్ట్ విప్పి.. నన్ను ఆల‌యంలోకి వెళ్లమ‌న్నారు.. క‌ర్ణాట‌క సీఎం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Karnataka | విధాత‌: స‌నాత‌న ధ‌ర్మంపై త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు క‌ర్ణాట‌క కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కేర‌ళ‌లోని ఓ ఆల‌యానికి తాను వెళ్లిన‌ప్పుడు ష‌ర్ట్ విప్పి లోప‌లికి రావాల‌ని ఆదేశించార‌ని సిద్ధ‌రామ‌య్య పేర్కొన్నారు. బెంగ‌ళూరులో నిర్వ‌హించిన నారాయ‌ణ గురు 169వ జ‌యంతి వేడుక‌ల్లో సిద్ధ‌రామ‌య్య పాల్గొని ప్ర‌సంగించారు. గ‌తంలో ఒక‌సారి కేర‌ళ‌లోని ఓ ఆల‌యానికి వెళ్లాను. ఆల‌యంలోకి […]

Karnataka | ష‌ర్ట్ విప్పి.. నన్ను ఆల‌యంలోకి వెళ్లమ‌న్నారు.. క‌ర్ణాట‌క సీఎం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Karnataka |

విధాత‌: స‌నాత‌న ధ‌ర్మంపై త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు క‌ర్ణాట‌క కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. కేర‌ళ‌లోని ఓ ఆల‌యానికి తాను వెళ్లిన‌ప్పుడు ష‌ర్ట్ విప్పి లోప‌లికి రావాల‌ని ఆదేశించార‌ని సిద్ధ‌రామ‌య్య పేర్కొన్నారు.

బెంగ‌ళూరులో నిర్వ‌హించిన నారాయ‌ణ గురు 169వ జ‌యంతి వేడుక‌ల్లో సిద్ధ‌రామ‌య్య పాల్గొని ప్ర‌సంగించారు. గ‌తంలో ఒక‌సారి కేర‌ళ‌లోని ఓ ఆల‌యానికి వెళ్లాను. ఆల‌యంలోకి ప్ర‌వేశించాలంటే ష‌ర్ట్ విప్పాల‌ని పూజారులు త‌న‌ను ఆదేశించారు.

అందుకు తాను తిర‌స్క‌రించి బ‌య‌ట నుంచే దేవుడికి దండం పెట్టుకున్నా. అయితే వారు అంద‌ర్నీ ష‌ర్ట్ విప్ప‌మ‌ని అడ‌గ‌లేదు.. కొంద‌రిని మాత్ర‌మే అడిగార‌ని సీఎం తెలిపారు. ఇది అమాన‌వీయమని పేర్కొన్నారు. దేవుడి ముందు అంద‌రూ స‌మాన‌మే అని సిద్ధ‌రామ‌య్య స్ప‌ష్టం చేశారు.