‘యాదాద్రి’లో రేపు కార్తీక తులసీ దామోదర వ్రతం
విధాత: యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తలు సౌకర్యార్థం తేదీ14-11-2022 కార్తీక బహుళ షష్టి సోమవారం రోజున కార్తీక తులసీ దామోదర వ్రతం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఎఓ ఎన్.గీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్రతాన్ని ఉదయం 11గంటల నుంచి 12.30 గంటల వరకు కొండ కింద వ్రత మండపంలో నిర్వహిస్తామని ప్రకటించారు. వ్రతాన్ని ఆచరించాలనుకునే భక్తులు వ్రత కౌంటర్ నందు రూ.516 టికెట్లను విక్రయిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం […]

విధాత: యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తలు సౌకర్యార్థం తేదీ14-11-2022 కార్తీక బహుళ షష్టి సోమవారం రోజున కార్తీక తులసీ దామోదర వ్రతం నిర్వహిస్తున్నట్టు ఆలయ ఎఓ ఎన్.గీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వ్రతాన్ని ఉదయం 11గంటల నుంచి 12.30 గంటల వరకు కొండ కింద వ్రత మండపంలో నిర్వహిస్తామని ప్రకటించారు. వ్రతాన్ని ఆచరించాలనుకునే భక్తులు వ్రత కౌంటర్ నందు రూ.516 టికెట్లను విక్రయిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.