Khammam | జనగర్జన సభ సక్సెస్.. జనసముద్రమైన ఖమ్మం
Khammam నిర్భందాలు, ఆటంకాలు ఎదుర్కొని స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు రాహుల్ ప్రసంగిస్తుండగా పీఎం, పీఎం అని పెద్ద ఎత్తున నినాదాలు రెండు సార్లు ప్రసంగాన్ని ఆపి సైలెంట్ అని సూచించిన రాహుల్ విధాత: కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సక్సెస్ అయింది. బీఆర్‌ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన 110 రోజులు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా […]

Khammam
- నిర్భందాలు, ఆటంకాలు ఎదుర్కొని స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు
- రాహుల్ ప్రసంగిస్తుండగా పీఎం, పీఎం అని పెద్ద ఎత్తున నినాదాలు
- రెండు సార్లు ప్రసంగాన్ని ఆపి సైలెంట్ అని సూచించిన రాహుల్
విధాత: కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సక్సెస్ అయింది. బీఆర్‌ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పాటు సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన 110 రోజులు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం పట్టణంలో నిర్వహించిన జనగర్జన సభకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్షలాధి మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా స్థలి మొత్తం జనంతో నిండిపోయింది. సభా ప్రాంగణం కిటకిట లాడింది. ఖమ్మం పట్టణ మంతా జన సముద్రమైంది. ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభకు ప్రజలు రాకుండా…అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఆర్టీసి ఇచ్చిన బస్సులు రద్దు చేసింది. లారీలు, ఇతర వాహనాలు రాకుండా అడ్డుకున్నది. రోడ్లకు అడ్డంగా బారీ కేడ్లు వేసి మరి జనం రాకుండా నియంత్రంచే చర్యలు చేపట్టింది. ఇందుకు పోలీస్, రవాణ శాఖ అధికారులను వాడుకుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
And look at Rahul’s cute expression ❤️ PM….PM….PM