Viral Video | కొండ చిలువనే మింగేసిన కింగ్ కోబ్రా..!
Viral Video | పెద కొండ చిలువనే.. ఆకలితో ఉన్న భారీ కింగ్ అమాంతం మింగేసింది. ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఇద్దరు పాము సంరక్షకులు భారీ కింగ్ కోబ్రా (టాకో)ను ఎన్‌క్లోజర్ నుంచి బయటకు తీసి.. చనిపోయిన ఓ కొండచిలువను దాని ముందు పెట్టారు. ఆకలితో ఉన్న కింగ్ కోబ్రా ఒక్కసారిగా దాన్ని పట్టుకొని నెమ్మదిగా మొత్తం కొండ చిలువను మింగేసింది. కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోను బ్రియాన్ […]

Viral Video | పెద కొండ చిలువనే.. ఆకలితో ఉన్న భారీ కింగ్ అమాంతం మింగేసింది. ఒళ్లుగగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఇద్దరు పాము సంరక్షకులు భారీ కింగ్ కోబ్రా (టాకో)ను ఎన్‌క్లోజర్ నుంచి బయటకు తీసి.. చనిపోయిన ఓ కొండచిలువను దాని ముందు పెట్టారు. ఆకలితో ఉన్న కింగ్ కోబ్రా ఒక్కసారిగా దాన్ని పట్టుకొని నెమ్మదిగా మొత్తం కొండ చిలువను మింగేసింది. కింగ్ కోబ్రాకు సంబంధించిన వీడియోను బ్రియాన్ బార్జిక్ (Brian Barczyk) అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసి, ‘కొండచిలువను తిన్న కింగ్ కోబ్రా’ అని క్యాప్షన్‌ను జత చేశారు. వాస్తవానికి ఈ వీడియోను గత జూలైలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నది. గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 1,064,738 వ్యూస్ వచ్చాయి.