దేశాభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి

దేశాభివృద్ధి కోసం మరోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపింఆచలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు

  • By: Somu    latest    Mar 04, 2024 11:31 AM IST
దేశాభివృద్ధి కోసం బీజేపీని గెలిపించండి
  • బీఆరెస్‌కు భవిష్యత్తు లేదు
  • అదిలాబాద్ సభలో కిషన్ రెడ్డి


విధాత, హైదరాబాద్: దేశాభివృద్ధి కోసం మరోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపింఆచలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి కోరారు. సోమవారం అదిలాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ అవినీతి, కుటుంబ పాలన చూశారని, ఆ పార్టీ ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడిందని విమర్శించారు. దేశ ప్రధానిగా మోడీ ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో దేశాభివృద్ధిని, కీర్తిప్రతిష్టలను రెట్టింపు చేశారన్నారు.


తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందుతుందని విమర్శించారు. హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానిక తగిన రోడ్ మ్యాప్ కూడా లేదన్నారు. ఇక బీఆరెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. పదేళ్లు కుటుంబ, అవినీతి పాలనను కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రుద్దారని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్‌ను తిరస్కరించారని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని 17 సీట్లలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మూడవ సారి మోడీని ప్రధానిగా అశీర్వదించాలని కోరారు. హైదరాబాద్‌లో ఈ దఫా ఎంఐంను కూడా ఓడిద్దామని పిలుపునిచ్చారు.