Minister Kishan Reddy | కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అస్వస్థత.. ఎయిమ్స్‌లో చేరిక
Minister Kishan Reddy | కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో ఆయన ఆదివారం రాత్రి 10.50 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కార్డియో న్యూరోసెంటర్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు కార్డియోవాస్కులర్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై అప్‌డేట్ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అంతకు ముందు కేంద్రమంత్రి ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన […]

Minister Kishan Reddy |
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో ఆయన ఆదివారం రాత్రి 10.50 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. కార్డియో న్యూరోసెంటర్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనకు కార్డియోవాస్కులర్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై అప్‌డేట్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. అంతకు ముందు కేంద్రమంత్రి ఓ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ దేశ వారసత్వం, చరిత్ర, సంస్కృతిని తెలియజేస్తుందన్నారు.
దేశ రాజధానిలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో రేడియో కార్యక్రమం 100వ ఎపిసోడ్ ను పురస్కరించుకుని ‘జన్ శక్తి: ఎ కలెక్టివ్ పవర్’ పేరిట నిర్వహించిన ఎగ్జిబిషన్ ప్రారంభ సభలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు.