తెలంగాణలో బీఆరెస్‌కు కాలం చెల్లింది: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

తెలంగాణలో బీఆరెస్‌కు కాలం చెల్లిందని, గ్రామస్థాయి నుంచి ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరాలని పిలుపునిస్తున్నామని అందరం కలిసి నరేంద్ర మోడీ

తెలంగాణలో బీఆరెస్‌కు కాలం చెల్లింది: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి

హామీల అమలులో కాంగ్రెస్ సాగదీత

విధాత : తెలంగాణలో బీఆరెస్‌కు కాలం చెల్లిందని, గ్రామస్థాయి నుంచి ఆ పార్టీ నేతలంతా బీజేపీలో చేరాలని పిలుపునిస్తున్నామని అందరం కలిసి నరేంద్ర మోడీ నాయకత్వంలో పని చేద్దామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి రాష్ట్రంలోని బీఆరెస్ నేతలను బీజేపీలోకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మొత్తం17స్థానాల్లోనూ పోటీ చేస్తుందని, మెజార్టీ సీట్లు గెలిచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సారి హైదరాబాద్ పార్లమెంటు స్థానంపై కూడా తాము దృష్టి పెట్టామన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి ఎన్నికల పోరుకు ముందే చీలికలు పేలికలై ఒక్కో పార్టీ ఆ కూటమి నుంచి బయటపడుతున్నాయన్నారు. ఇక రాష్ట్రాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక సాగదీత దాటవేత వైఖరి అనుసరిస్తుందన్నారు. ఇచ్చిన ఆరు ప్రధాన హామీల్లో రెండు మాత్రమే అమలు చేశారని, మిగతాని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో దోపిడీ చేసి దేశమంతా ఖర్చు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నేస్తోందని, అందుకోసం రాష్టంలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పాలకులు రియల్టర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల నుంచి వసూళ్లకు తెరలేపారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.