క్లింకార‌తో రామ్ చ‌రణ్‌, ఉపాస‌నల ఫ‌స్ట్ ఫారెన్ టూర్.. కూతురి ఫేస్ మాత్రం రివీల్ చేయ‌డం లేదుగా..!

  • By: sn    latest    Oct 19, 2023 10:44 AM IST
క్లింకార‌తో రామ్ చ‌రణ్‌, ఉపాస‌నల ఫ‌స్ట్ ఫారెన్ టూర్.. కూతురి ఫేస్ మాత్రం రివీల్ చేయ‌డం లేదుగా..!

దాదాపు ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రులుగా ప్ర‌మోష‌న్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఈ దంప‌తుల‌కి ఆడ‌పిల్ల పుట్ట‌డంతో చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ, అభిమానులు కూడా చాలా సంతోషించారు. మ‌హ‌ల‌క్ష్మీ అడుగుపెట్టింద‌ని చెప్పుకొచ్చారు. అయితే పాప పుట్టిన కొద్ది రోజుల‌కి నామ‌క‌ర‌ణం చేసి క్లింకార అని పేరు పెట్టారు. అయితే రామ్ చ‌ర‌ణ్ ముద్దుల కూతురు ఎలా ఉంది, ఎవరి పోలికలు ఉన్నాయ‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉండ‌గా, చెర్రీ-ఉప్సీ మాత్రం చిన్నారి ఫేస్ క‌నిపించ‌కుండా చాలా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉపాసన క్లీంకార ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఉపాసన తన తల్లిదండ్రులు క్లింకారను ఎత్తుకుని జెండా వందనం చేయ‌గా, అప్పుడు క్లింకార కూడా ఉంది. కాక‌పోతే అక్క‌డ ఆమె ఫేస్ రివీల్ కానివ్వ‌లేదు.

రీసెంట్‌గా చిరంజీవి ఇంట్లో వినాయ‌క చ‌వితి వేడుక‌లు జర‌గ‌గా, ఆ వేడుక‌ల‌లో కూడా క్లింకార కూడా పాల్గొంది. ఆ ఫొటోల‌ని చిరు పోస్ట్ చేశారు. అప్పుడు కూడా ఫేస్ క‌నిపించ‌లేదు. ఇక తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి ఇటలీ ట్రిప్ బయల్దేరాడు.. ఎయిర్ పోర్ట్ లో రామ్ చరణ్ ఉపాసన, క్లింకారతో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల‌వుతుండ‌గా, ఆ ఫొటోల‌లో ఉపాస‌న త‌న కూతురు ఫేస్ క‌నిపించ‌కుండా చేయి అడ్డు పెట్టింది. అయిన‌ప్ప‌టికీ పిక్స్ మాత్రం తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. క్లింకార బాగానే పెద్ద‌దైన‌ట్టు ఉందే అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రాంచరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రం చేస్తుండ‌గా, ఈ చిత్రం శంకర్ దర్శకత్వంలో రూపొందుతుంది. చాలా కాలంగా ఈ చిత్రం డిలే అవుతూ వస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే షూటింగ్ నుంచి రామ్ చ‌ర‌ణ్‌కి కాస్త విరామం దొరకడంతో ఫారెన్ ట్రిప్‌కి ప‌య‌నం అయ్యారు. మెగా ప‌వర్ స్టార్ తన పెట్ రైమ్ ని ఎత్తుకుని వెళుతుండగా.. క్లీంకార త‌న తల్లి ఉపాసన ఒడిలో ఒదిగిపోయింది. ఈ అందమైన దృశ్యాలు నెటిజన్లని ఎంత‌గానో ఆకట్టుకుంటున్నాయి. ఇటలీలో తమ కుమార్తెతో చరణ్, ఉపాసన ఎక్కువరోజులు వెకేషన్ లో ఎంజాయ్ చేయనున్నార‌ని తెలుస్తుంది. వెకేష‌న్ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ వీలైనంత త్వ‌ర‌గా గేమ్ ఛేంజర్ షూటింగ్ ముగించాల‌ని అనుకుంటున్నారు.