Newborn Child Died | టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. కిటికీలో నుంచి కాలువలోకి..!

Newborn Child Died | ఓ మహిళ మాతృత్వానికి మాయని మచ్చను తీసుకువచ్చింది. టాయిలెట్‌లో బిడ్డకు జన్మనించి.. ఆ తర్వాత బిడ్డను కాలువలోకి విసిరేసింది. అభం శుభం తెలియని చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఓ మహిళ తన ఇంట్లో టాయిలెట్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే ఆమె బిడ్డకు జన్మనించింది. అయితే, […]

Newborn Child Died | టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. కిటికీలో నుంచి కాలువలోకి..!

Newborn Child Died | ఓ మహిళ మాతృత్వానికి మాయని మచ్చను తీసుకువచ్చింది. టాయిలెట్‌లో బిడ్డకు జన్మనించి.. ఆ తర్వాత బిడ్డను కాలువలోకి విసిరేసింది. అభం శుభం తెలియని చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఓ మహిళ తన ఇంట్లో టాయిలెట్‌కు వెళ్లింది.

ఈ క్రమంలోనే ఆమె బిడ్డకు జన్మనించింది. అయితే, అకస్మాత్తుగా బిడ్డకు జన్మనివ్వడంతో ఏం చేయాలో పాలుపోక మరుగుదొడ్డి కిటికీ పగులగొట్టి అందులో నుంచి చిన్నారిని కాలువలోకి విసిరిపడేసింది. అయితే, కిటికీ పగలుగొట్టిన శబ్దం విన్న స్థానికులు మహిళ కిటికీలో నుంచి ఏదో విసిరి వేసినట్లుగా గమనించారు. అక్కడికి వెళ్లి చూసే సరికి శిశువు కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని శిశువును రక్షించి ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే, మహిళకు తాను గర్భవతిని అని తెలియదని చెప్పింది. టాయిలెట్‌కు వెళ్లిన సమయంలో బిడ్డ జన్మించడంతో ఏం చేయాలో అర్థం కాక కిటకీ పగులగొట్టి నవజాత శిశువును కాలువలో పడేసినట్లు పేర్కొంది.

అయితే, సదరు మహిళ మద్యానికి బానిసైందని, ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉంటూ గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. భార్యాభర్తలిద్దరూ మద్యానికి బానిసలయ్యారని, సదరు మహిళ మానసిక పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని తెలిపారు. గత రెండు మూడు నెలలుగా సరిగా ఉండడం లేదని, అయితే ఏడు నెలలకే బిడ్డ పుట్టిందని చెప్పారు. గర్భం దాల్చిన సమయంలోనే గాయమైందని, దాంతో మహిళకు రక్తస్రావం అవుతుందని, ఈ మహిళ రక్తాన్ని చూసి పీరియడ్స్‌గా భావించిందని వైద్యులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. సదరు మహిళపై సెక్షన్‌ 315 కింద కేసు నమోదు చేశామని, మహిళ నేరాన్ని అంగీకరించిందని పోలీసులు వివరించారు.