కోరి తెచ్చుకున్న ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ఆత్మహత్య: గుత్తా

విధాత: కోరి తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నిక ఓటమితో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలు కేసీఆర్ సంక్షేమ పాలనకు పట్టం కట్టి, బీజేపీ మతోన్మాద, విచ్చన్నకర రాజకీయలను తిప్పి కొట్టి చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారన్నారు. మునుగోడులో కేసీఆర్, లౌకికవాదులు గెలిచారన్నారు. మునుగోడు ఎన్నికలు ప్రజల ఆకాంక్షలను వెల్లడిం చాయన్నారు. బలవంతంగా […]

  • By: krs    latest    Nov 08, 2022 5:29 AM IST
కోరి తెచ్చుకున్న ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ ఆత్మహత్య: గుత్తా

విధాత: కోరి తెచ్చుకున్న మునుగోడు ఉప ఎన్నిక ఓటమితో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ప్రజలు కేసీఆర్ సంక్షేమ పాలనకు పట్టం కట్టి, బీజేపీ మతోన్మాద, విచ్చన్నకర రాజకీయలను తిప్పి కొట్టి చెంప పెట్టులాంటి తీర్పు ఇచ్చారన్నారు.

మునుగోడులో కేసీఆర్, లౌకికవాదులు గెలిచారన్నారు. మునుగోడు ఎన్నికలు ప్రజల ఆకాంక్షలను వెల్లడిం చాయన్నారు. బలవంతంగా రుద్దిన ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా నష్టపోయారన్నారు.
తెలంగాణలో విచ్చిన్నకర శక్తులకు స్థానం లేదని రుజువైందన్నారు. దేశానికి మార్గదర్శనంలా రాజకీయా లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపఎన్నిక రాజకీయాల కోసం కేంద్రం ఇన్కం టాక్స్ వాళ్ళను కూడా వాడిన తీరు ఇది అత్యంత దుర్మార్గమన్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐలు దేశంలో నవ్వుల పాలయ్యాయన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి అవసరం చాలా ఉందని, సామాన్య ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సీఎం కేసీఆర్ పాటు పడుతారన్న నమ్మకం ప్రజలకు ఉందన్నారు.

కేసీఆర్ నాయకత్వంపై దేశ ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. నేడు అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి ఇపుడు అవసరమన్నారు. ఇబ్బడిముబ్బడిగా
పన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్న బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.

కేంద్రంలోని బీజేపీ పాలన సామాన్యులకు శరాఘాతంగా మారిందన్నారు. దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ పార్టీ రానున్న రోజుల్లో పెను మార్పులు తేవడం తధ్యమని, బీజేపీ పాలనతో విసిగిపోయిన దేశ ప్రజలు తెలంగాణ మోడల్ పాలన కోసం Brs వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు.