నాకు హోంశాఖ ఇస్తే వాళ్లను జైళ్లో వేయిస్తా: రాజగోపాల్ రెడ్డి

నాకు హోంశాఖ ఇస్తే కేసీఆర్ సహా వారి కుటుంబ సభ్యులను జైళ్లో వేయిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

నాకు హోంశాఖ ఇస్తే వాళ్లను జైళ్లో వేయిస్తా: రాజగోపాల్ రెడ్డి

విధాత : నాకు హోంశాఖ ఇస్తే కేసీఆర్ సహా వారి కుటుంబ సభ్యులను జైళ్లో వేయిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైన సందర్భంగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన రాజగోపాల్‌రెడ్డి తాను కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకని అన్నారు. నేనూ హోంమంత్రి అయితేనే వాళ్ళు(కేసీఆర్ కుటుంబం) కంట్రోల్‌లో ఉంటారన్నారు. అసెంబ్లీ తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని, నాకు మంత్రి పదవి ఇస్తానని అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. నేను హోం శాఖ ఇవ్వాలని కోరుతున్నానన్నారు.బీఆరెస్‌ను బీజేపీలో

విలీనం చేస్తారని, కేసీఆర్‌కు బీజేపీ యే శ్రీరామరక్ష అన్నారు. నేను హోంశాఖ మంత్రినైతే కేసీఆర్, కేటిఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా అయన కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌కు తమ కుటుంబ సభ్యులెవ్వరు పోటి చేయకూడదని మా ఉద్దేశమని, పార్టీ అదేశిస్తే పోటి చేస్తామని, టికెట్‌ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామన్నారు.