Komatireddy | రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అవసరమా.. ఉత్సవ ఖర్చులపై కోమటిరెడ్డి మండిపాటు
Komatireddy | విదాత : రైతాంగం, నిరుద్యోగులతో పాటు పలు వర్గాల ప్రజలు రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో 105 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని మాజీమంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. ఆదివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎండల్లో వానల్లో ఐకెపి కేంద్రాల్లో రాత్రి పగలు ఉంటున్న రైతులను అడిగితే దశాబ్ది ఉత్సవాలు అవసరమో కాదో చెబుతారన్నారు. కరీంనగర్ లో రైతు కొనుగోలు […]

Komatireddy |
విదాత : రైతాంగం, నిరుద్యోగులతో పాటు పలు వర్గాల ప్రజలు రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో 105 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని మాజీమంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.
ఆదివారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎండల్లో వానల్లో ఐకెపి కేంద్రాల్లో రాత్రి పగలు ఉంటున్న రైతులను అడిగితే దశాబ్ది ఉత్సవాలు అవసరమో కాదో చెబుతారన్నారు. కరీంనగర్ లో రైతు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్ప పై పడుకుంటే ట్రాక్టర్ ఎక్కి చనిపోయాడన్నారు.
రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు అనేక వ్యయప్రయాసలతో గ్రూప్ పరీక్షలకు సిద్ధమైతే పేపర్ల లీకేజీ తో వారి భవిష్యత్తు గందరగోళంలో పడేసారన్నారు. టీచర్స్ రిక్రూట్మెంట్ 9 ఏళ్ల నుండి లేదన్నారు. నిరుద్యోగులను అడిగితే దశాబ్ది ఉత్సవాలు అవసరమో కాదో వారే చెబుతారన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వం లేనిపోని హంగామాకు సిద్ధపడిందన్నారు. ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు మోసపూరిత ప్రకటనలు చేసిన ఈ దఫా వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదు అన్నారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలను కాంగ్రెస్ గెలిచి తీరుతుందన్నారు.