Komatireddy | కాంగ్రెస్ దే విజయం.. సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయి: ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy విధాత, యాదాద్రి భువనగిరి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపయినర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వలిగొండ మండలం నర్సాయిగూడెంకు చెందిన సీనియర్ కాంగ్రెస్‌నేత, మాజీ ఎంపీపీ తుమ్మల నర్సయ్య గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని వెంకట్‌రెడ్డి పరామర్శించి అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ […]

  • By: Somu    latest    Aug 12, 2023 12:39 AM IST
Komatireddy | కాంగ్రెస్ దే విజయం.. సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయి: ఎంపీ కోమటిరెడ్డి

Komatireddy

విధాత, యాదాద్రి భువనగిరి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, సర్వేలన్నీ ఇదే చెప్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపయినర్, భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వలిగొండ మండలం నర్సాయిగూడెంకు చెందిన సీనియర్ కాంగ్రెస్‌నేత, మాజీ ఎంపీపీ తుమ్మల నర్సయ్య గుండెపోటుతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని వెంకట్‌రెడ్డి పరామర్శించి అంత్యక్రియాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ గా ఉందని, ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

ఎన్నికల దిశగా పార్టీ సన్నాహాల్లో భాగంగా ఈనెల 16, 17 తర్వాత బస్సుయాత్ర మొదలుపెడతామని, తెలంగాణ అంతా కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర ముఖ్యనేతలు పర్యటిస్తారన్నారు. 24 గంటల కరెంట్ పై సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పేవన్ని అబద్ధాలని, లాగ్ బుక్‌లతో ఆ విషయాన్ని బయటపెట్టామన్నారు. కరెంటు సక్రమంగా సరఫరా చేయకపోతే మరోసారి సబ్ స్టేషన్ ల వద్ద ధర్నాలకు దిగుతామని, దెబ్బకు కేసీఆర్ దిగి రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 24 గంటల కరెంట్ ఇస్తామని, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పైనే చేస్తామన్నారు. 4 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు. మా ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తామన్నారు.

సీఎం కేసీఆర్ గ్రూప్‌-2పరీక్షలను వాయిదా వేయమని నిరుద్యోగులు కోరితే వినడం లేదన్నారు. 5 లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారని, మా ప్రభుత్వం వచ్చిన 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని, వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారని, ఒక్క మద్యం అమ్మకాల ద్వారానే 50వేల కోట్లు వస్తున్నాయని, ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయని ప్రశ్నించారు.

భువనగిరి అంటే పోరాటాలకు మారుపేరని, భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ ని గెలిపిస్తానన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఫ్యాన్సు, బాత్రూమ్స్ లేకపోతే 20 లక్షలు పెట్టి బాగు చేయించానని, మైనార్టీల కోసం 20 లక్షలు పెట్టి దర్గా కట్టించానని, పేద విద్యార్థులు నా దగ్గరకు వస్తే పార్టీలకు అతీతంగానే సాయం చేస్తున్నానన్నారు. ప్రజా సేవలో, పార్టీ విస్తరణలో నిరంతరం పనిచేస్తున్నాననని, ప్రజలు కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తే, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.