హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొందపెట్టుడే

100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను జనం బొంద పెడుతారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్‌ను బొందపెట్టుడే
  • 420హామీలతో మోసపోయిన పల్లె జనం
  • లంకె బిందెల కోసం దొంగలే తిరుగుతారు
  • ఉప్పల్ బీఆరెస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత : 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను జనం బొంద పెడుతారని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఉప్పల్ బీఆరెస్ నియోజకవర్గం సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాషను జనం చూసి అసహ్యించుకుంటున్నారని చిన్నాపెద్ద తేడా లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. 420 హామీలు చూసి జిల్లాల్లోని జనం మోసపోయారని, పట్టణ ఓటర్లు మాత్రమే బీఆరెస్ చేసిన అభివృద్ధిని గుర్తించి గెలిపించారన్నారు. కాంగ్రెస్ మాటల ప్రభుత్వమేనని, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారన్నారు. సీఎం వారేదో లంకె బిందెల కోసం వస్తే అంతా ఖాళీ కుండలే కనిపిస్తున్నాయంటున్నారని, లంకెబిందెల కోసం దొంగలే తిరుగుతారని కేటీఆర్ చురుకలేశారు.

గతంలో రేవంత్ రెడ్డి అదే కావచ్చు నాకైతే తెలియదన్నారు. రేవంత్ రెడ్డి లాగా మేము తిట్టగలుతామని, 100రోజుల్లో హామీల అమలు చేయకపోతే నిలదీత సాగిస్తామన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మన మంచికే వచ్చాయి అనుకుంటున్నామని, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందన్నారు. నికృష్ట కాంగ్రెస్ పాలన జనానికి తెలుస్తుందని, ఆ తర్వాతా బీఆరెస్‌ను ప్రజలు మళ్లీ ఆదరిస్తారన్నారు. ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసోడు ఉన్నాడా అర్దం కావటం లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదేనని, కాంగ్రెస్ ను మల్కాజ్ గిరిలో మడత పెట్టీ కొట్టుడేనన్నారు.