సరే సర్లే చాలా అనుకుంటాం.. కేటీఆర్ కుమారుడి ట్వీట్ వైరల్
Himanshu Rao | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు కూడా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన అంశం ఏదైనా ఉంటే క్షణాల్లోనే పోస్టు చేసేస్తుంటారు. హిమాన్షు రావుకు కూడా ట్విట్టర్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే హిమాన్షు రావు ఫార్మల్ డ్రెస్ ధరించి ఉన్న ఓ ఫోటోను అక్షయ్ అనే యూజర్ తన ట్విట్టర్ పేజీలో […]

Himanshu Rao | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు కూడా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన అంశం ఏదైనా ఉంటే క్షణాల్లోనే పోస్టు చేసేస్తుంటారు. హిమాన్షు రావుకు కూడా ట్విట్టర్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.
అయితే హిమాన్షు రావు ఫార్మల్ డ్రెస్ ధరించి ఉన్న ఓ ఫోటోను అక్షయ్ అనే యూజర్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. సడెన్‌గా చూసి కేటీఆర్ అన్న అనుకున్నానను అని అక్షయ్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. లవ్ సింబల్‌ను రీట్వీట్ చేశారు.
ఇక ఈ ఫోటోపై హిమాన్షు రావు కూడా స్పందించారు. ఓ గ్రేట్ పర్సన్ ఒకప్పుడు చెప్పారు.. సరేసర్లే చాలా అనుకుంటాం.. అన్ని జరుగుతాయా ఏంటీ..? అని రాసుకొచ్చారు. ఇది జోక్ మాత్రమే.. థాంక్యూ అంటూ హిమాన్షు పేర్కొన్నారు.
A great man once said “sarsarle ennenno anukuntam, anni jaruguthaaya enti”.