23న భూపాలపల్లికి KTR: బొట్టు పెట్టి.. మహిళలకు గండ్ర జ్యోతి ఆహ్వానం

సభకు రావాల‌ని డప్పు చప్పుల్లతో ఇంటింటి ప్రచారం ఉండమ్మా బొట్టు పెడతా.. అనేది మీరు వినే ఉంటారు.. అది సినిమా టైటిల్. కానీ, ఇక్కడ రండమ్మా.. బొట్టు పెడుతున్నాను.. అంటూ BRS పార్టీ నాయకురాలు గండ్ర జ్యోతి ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి మరీ సభకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ నెల మంత్రి KTR రాక సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విన్నవించారు. విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: (Bhupalpally) భూపాల్ […]

23న భూపాలపల్లికి KTR: బొట్టు పెట్టి.. మహిళలకు గండ్ర జ్యోతి ఆహ్వానం
  • సభకు రావాల‌ని డప్పు చప్పుల్లతో ఇంటింటి ప్రచారం

ఉండమ్మా బొట్టు పెడతా.. అనేది మీరు వినే ఉంటారు.. అది సినిమా టైటిల్. కానీ, ఇక్కడ రండమ్మా.. బొట్టు పెడుతున్నాను.. అంటూ BRS పార్టీ నాయకురాలు గండ్ర జ్యోతి ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి మరీ సభకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ నెల మంత్రి KTR రాక సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని విన్నవించారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: (Bhupalpally) భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో తమ పార్టీ బీఆర్ఎస్ నాయకుడు, మంత్రి కేటీఆర్(ktr)సభ ఉందంటూ… సభను జయప్రదం చేయాలని కోరుతూ.. డప్పు చప్పుల మధ్య ఇంటింటికి తిరిగి బొట్టుపెట్టి వరంగల్ జిల్లా జ‌డ్పీ చైర్ పర్సన్, బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు, స్థానిక ఎమ్మెల్యే సతీమణి గండ్ర జ్యోతి (Gandra jyothi)ఆహ్వానించారు. సభ సక్సెస్‌కు తన వంతు ప్రయత్నాలూ.. ప్రచార కార్యక్రమం చేపట్టారు.

23న భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్ టూర్

ఈనెల 23వ తేదీన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భూపాల్ పల్లిలో భారీ బహిరంగ సభ (public meeting) నిర్వహించేందుకు నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆధ్వర్యంలో ఈ సభ విజయవంతానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఎమ్మెల్యేకు తోడుగా గండ్రజ్యోతి సోమవారం మేళ తాళాలూ, డప్పు చప్పులు, కార్యకర్తల నృత్యాలు, కోలాహలం మధ్య పట్టణంలోని వీధి వీధి తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఇళ్లల్లోకి వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించారు.

భారీ సభకు ఏర్పాట్లు

కేటీఆర్ రాక సందర్భంగా భూపాల్ పల్లి జిల్లా కేంద్రంలో 50 వేల మందితో భారీ సభ నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా జ్యోతి ప్రకటించారు. (Hyderabad)హైదరాబాద్, వరంగల్ తర్వాత అభివృద్ధి చెందుతున్న ప్రాంతం భూపాలపల్లి అంటూ వివరించారు.

ఈ పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ తగిన చేయూత అందించాలని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పలు అభివృద్ధి నివేదికలు మంత్రికి అందజేశారని చెప్పారు. మంత్రి రాకతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు(Development programs) కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ రాక సందర్భంగా జరిగే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.