KTR VS Harishrao | హుస్నాబాద్‌లో కేటీఆర్ పర్యటన.. హరీశ్‌రావు దూరం!
KTR VS Harishrao హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కార్యక్రమాలకు హాజరు కాని హరీశ్, జడ్పీ చైర్మన్, వర్గం విధాత: ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో అధికార పార్టీలో నంబర్ 2గా ఉన్న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు స్వంత జిల్లాలో కేటీఆర్ నెమ్మదిగా పాగా వేస్తున్నారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ అధ్వర్యంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా జరిగాయి. ఈ సందర్భంగా […]

KTR VS Harishrao
- హుస్నాబాద్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- కార్యక్రమాలకు హాజరు కాని హరీశ్, జడ్పీ చైర్మన్, వర్గం
విధాత: ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో అధికార పార్టీలో నంబర్ 2గా ఉన్న రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు స్వంత జిల్లాలో కేటీఆర్ నెమ్మదిగా పాగా వేస్తున్నారు.
గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ అధ్వర్యంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా జరిగాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జీవన్ పాటిల్, సీపీ శ్వేత రెడ్డితో పాటు అధికార యంత్రాంగం మొత్తం హుస్నాబాద్‌లో ఉంది. కానీ ఈ కార్యక్రమాలలో మంత్రి హరీశ్ రావు గానీ, ఆయన వర్గం గానీ పాలు పంచుకోకపోవడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తున్నది.
మంత్రి హరీష్ రావు సిద్దిపేటలోనే ఉండి అటవీశాఖ అధికారుల క్వార్టర్లను ప్రారంభం తదితర కార్యక్మాలలో పాల్గొన్నారు గానీ హుస్నాబాద్‌లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలలో గానీ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో గానీ పాలుపంచుకోక పోవడంపై సర్వత్రా చర్చ ప్రారంభమైంది. అంతేగాక జిల్లా పరిషత్ చైర్మన్‌తో సహా హరీశ్‌రావు వర్గానికి చెందిన నాయకులెవరూ మంత్రి కేటీఆర్ ప్రోగ్రాంకి హాజరవలేదు.