స్వర్ణ రథం అధిరోహించిన‌ లక్ష్మీ నరసింహులు

విధాత: రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో సాయంకాలం స్వామివారు బంగారు రథంలో అంతర మాడవీధిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. స్వామివారి స్వర్ణరథ అధిరోహణం చేసిన లక్ష్మీ నరసింహుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని పులకించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి గీత, ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

స్వర్ణ రథం అధిరోహించిన‌ లక్ష్మీ నరసింహులు

విధాత: రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకల్లో సాయంకాలం స్వామివారు బంగారు రథంలో అంతర మాడవీధిలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

స్వామివారి స్వర్ణరథ అధిరోహణం చేసిన లక్ష్మీ నరసింహుడిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని పులకించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి గీత, ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.