పేరు మార్పును లైట్ తీసుకొండమ్మా.. లేటుగా అయినా స్పందించిన లక్ష్మీ పార్వతి
ఉన్నమాట: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తీసి వైఎస్సార్ పేరు పెట్టిన విషయంలో రెండ్రోజులపాటు అటు టీడీపీ.. ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఉప్పు నిప్పు మాదిరిగా సవాళ్లు ప్రతిసవాళ్ళు విసురుకున్న తరువాత తీరిగ్గా లక్ష్మీపార్వతి స్పందించారు. నిన్నా మొన్న ఆమె ఇంకా ఎందుకు స్పందించలేదని.. భార్యగా ఆమెకు బాధ్యత లేదా.. ఎమోషన్ లేదా అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో లక్ష్మీ పార్వతి స్పందిస్తూ జగన్‌ను వెనకేసుకు వచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ […]

ఉన్నమాట: హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తీసి వైఎస్సార్ పేరు పెట్టిన విషయంలో రెండ్రోజులపాటు అటు టీడీపీ.. ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఉప్పు నిప్పు మాదిరిగా సవాళ్లు ప్రతిసవాళ్ళు విసురుకున్న తరువాత తీరిగ్గా లక్ష్మీపార్వతి స్పందించారు. నిన్నా మొన్న ఆమె ఇంకా ఎందుకు స్పందించలేదని.. భార్యగా ఆమెకు బాధ్యత లేదా.. ఎమోషన్ లేదా అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో లక్ష్మీ పార్వతి స్పందిస్తూ జగన్‌ను వెనకేసుకు వచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నందమూరి కుటుంబ సభ్యులకు బంఫర్ ఆఫర్ ఇచ్చారని లక్ష్మీపార్వతి అన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని ఎన్టీఆర్ హెల్త్ యూనవర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టారని అన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు కావాలా? లేక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు కావాలా అనేది తేల్చుకోవాలని జగన్ బంఫర్ ఆఫర్ ఇచ్చారని లక్ష్మీపార్వతి అన్నారు. తానయితే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్నే కోరుకుంటానన్నారు. యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేయడం అనేది చాలా చిన్న విషయమన్నారు.
ఇదే తరుణంలో ఆమె చంద్రబాబుపై విమర్సల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ను చంపిన దుర్మార్గులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పేరు మార్పుపై ఎప్పుడూ కూడా ఆలోచించని వారు ఇప్పుడు రాద్దాంతం చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆమె చెప్పడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు రాధాకృష్ణ ఓ వీడియోలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తీసేయాలని మాట్లాడుకోలేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మారిస్తే మాత్రం వీళ్లు మరోలా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఎన్టీఆర్ పేరు.. హెల్త్ యూనివర్సిటీకి కావాలా? జిల్లాకి కావాలా? అంటే తాను జిల్లాకే పేరు ఉండాలని కోరుకుంటానని లక్ష్మీపార్వతి చెప్పడం గమనార్హం. జిల్లాకు పేరు పెట్టడంలోనే వైఎస్ జగన్కు ఎన్టీఆర్పై ఉన్న ప్రేమ ఏంటో తెలుస్తోందని లక్ష్మీపార్వతి తన ప్రెస్ మీట్లో ప్రశంసలు కురిపించారు. ద్వేషంతోనో పగతోనో యూనివర్సిటీ ఎన్టీఆర్ పేరు మార్చలేదని చెప్పారు.