LB Nagar (లింగోజిగూడ) కార్పొరేటర్ రాజశేఖరెడ్డిపై.. BRS కార్యకర్తల దాడి

LB Nagar విధాత: కాంగ్రెస్ పార్టీ ఎల్బి నగర్ (లింగోజిగూడ) కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరెడ్డిపై బిఅర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్‌లో చోటు చేసుకుంది. మన్సూరాబాద్‌ ఏంయి రెడ్డి గార్డెన్స్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ ప్రగతి కార్యక్రమం నిర్వహించగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కార్పొరేటర్‌పై అక్కడే ఉన్న కొంత మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పూనుకున్నారు. గత కొంతకాలంగా, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ […]

  • By: krs    latest    Jun 05, 2023 12:45 AM IST
LB Nagar (లింగోజిగూడ) కార్పొరేటర్ రాజశేఖరెడ్డిపై.. BRS కార్యకర్తల దాడి

LB Nagar

విధాత: కాంగ్రెస్ పార్టీ ఎల్బి నగర్ (లింగోజిగూడ) కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరెడ్డిపై బిఅర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడిన ఘటన ఎల్బీనగర్‌లో చోటు చేసుకుంది.

మన్సూరాబాద్‌ ఏంయి రెడ్డి గార్డెన్స్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ ప్రగతి కార్యక్రమం నిర్వహించగా ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కార్పొరేటర్‌పై అక్కడే ఉన్న కొంత మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడికి పూనుకున్నారు.

గత కొంతకాలంగా, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ముందు కాంగ్రెస్, బిజెపి నాయకులు కలిసి ధర్నాకు దిగారు.