Ponguleti |
విధాత, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మాటలకే పరిమితం అయ్యారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎందరో అమరులు, ఉద్యమకారులు ఆరు దశాబ్ధాలుగా పోరాటాన్ని గుర్తించిన సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా 2014లో తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించారన్నారు. కానీ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను నేడు కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటుందన్నారు.
ఖమ్మం వేదికగా నిర్వహించిన ‘తెలంగాణ జనగర్జన’లో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో, 2018లో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ దశాబ్ధకాలం మాయ మాటలతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. కేసీఆర్ వి మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నారు. రుణమాఫీ చేస్తాను, రైతును రాజును చేస్తానని చెప్పిన కేసీఆర్ మాట తప్పారని, దీంతో రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హామీలన్నీ నెరవేర్చుతాం
Watch video>>>https://t.co/TvJiPov979#Telangana #JanaGarjana #Congress #RahulGandhi #PonguletiSrinivasReddy #RevanthRedy #BhattiVikramarka #NTVNews #NTVTelugu
— NTV Telugu (@NtvTeluguLive) July 2, 2023
రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. రాహుల్ గాంధీ వరంగల్ వేధికగా ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని అంశాలను అన్నింటిని అమలు చేసి రైతుల కష్టాలను కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణ మాఫీని అమలు చేస్తామన్నారు.
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని నేటికీ ఇవ్వలేదన్నారు. అలాగే ఇంటికో ఉద్యోగం అన్నారు కానీ ఉద్యోగాలే ఇవ్వలేదన్నారు. 2023 జనవరి 1వ తేదీ నుంచి నేటి వరకు ఆలోచించి, ఆత్మీయ సమ్మేళనాల ద్వారా మెజార్టీ ప్రజల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌లో చేరానని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వేడి నీళ్లతో చలినీళ్లు కలిసినట్లుగా కాంగ్రెస్ లో చేరడం వలన కాంగ్రెస్‌తో పాటు తనకు మేలు జరుగుతుందని ప్రజలు ఆశీర్వదించారన్నారు.
తెలంగాణ ప్రజలను దోచుకుంటున్న బీఆర్ఎస్ పార్టీని బంగాళఖాతంలో కలిపేద్దామన్నారు. రాహుల్ గాందీ భారత్ జోడో యాత్రతో యావత్ దేశంలో కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందన్నారు. ప్రజలందరి మద్దతుతో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేద్దామని పొంగులేటి పిలుపునిచ్చారు.
1250 కిలోమీటర్ల పాదయాత్ర ద్వరా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్న భట్టి విక్రమార్క పాదయాత్ర స్ఫూర్తిదాయకం అన్నారు. అధికార మదంతో విర్రవీగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును గద్దె దించడమే తమ లక్ష్యం, ఆశయం, ఆలోచన అని పొంగులేటి అన్నారు.