Viral Video | న‌డిరోడ్డుపై ఆవుపై ఆడ సింహాం దాడి.. రైతు ఏం చేశాడంటే..?

Viral Video | అడ‌వికి మృగ‌రాజు సింహాం. ఏదైనా జంతువు త‌మ కంట ప‌డిందంటే చాలు.. వాటిని వేటాడి భ‌క్షిస్తాయి. కానీ కొన్ని సంద‌ర్భాల్లో సింహాలు వేటాడం మాని వెనుతిరుగుతుంటాయి. అలాంటి ఘ‌ట‌నే గుజ‌రాత్‌లోని గిర్ సోమ‌నాథ్ జిల్లాలో వెలుగు చూసింది. న‌డిరోడ్డుపై ఓ ఆవు వెళ్తుండ‌గా.. దాన్ని సింహాం వేటాడింది. ఆవు మెడ‌ను సింహాం గ‌ట్టిగా త‌న నోటితో ప‌ట్టుకుంది. రోడ్డుపై అటు ఇటు సింహాం ఆవును ఈడ్చుకెళ్లింది. సింహాం బారి నుంచి త‌ప్పించుకునేందుకు ఆవు […]

Viral Video | న‌డిరోడ్డుపై ఆవుపై ఆడ సింహాం దాడి.. రైతు ఏం చేశాడంటే..?

Viral Video | అడ‌వికి మృగ‌రాజు సింహాం. ఏదైనా జంతువు త‌మ కంట ప‌డిందంటే చాలు.. వాటిని వేటాడి భ‌క్షిస్తాయి. కానీ కొన్ని సంద‌ర్భాల్లో సింహాలు వేటాడం మాని వెనుతిరుగుతుంటాయి. అలాంటి ఘ‌ట‌నే గుజ‌రాత్‌లోని గిర్ సోమ‌నాథ్ జిల్లాలో వెలుగు చూసింది.

న‌డిరోడ్డుపై ఓ ఆవు వెళ్తుండ‌గా.. దాన్ని సింహాం వేటాడింది. ఆవు మెడ‌ను సింహాం గ‌ట్టిగా త‌న నోటితో ప‌ట్టుకుంది. రోడ్డుపై అటు ఇటు సింహాం ఆవును ఈడ్చుకెళ్లింది. సింహాం బారి నుంచి త‌ప్పించుకునేందుకు ఆవు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించింది. కానీ సాధ్యం కాలేదు.

చివ‌ర‌కు ఆవు య‌జ‌మానే సాహసం చేయాల్సి వ‌చ్చింది. రోడ్డు ప‌క్క‌నే ఉన్న రాళ్ల‌తో సింహాంపై దాడి చేశాడు. దీంతో సింహాం ఆవును వ‌దిలేసి అడవుల్లోకి పారిపోయింది.

ఆవు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌డంతో రైతు ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ దృశ్యాన్ని అంతా ఆ మార్గంలో వెళ్తున్న ఓ వాహ‌న‌దారుడు త‌న ఫోన్‌లో చిత్రీక‌రించి, సామాజిక మాధ్య‌మాల్ల వైర‌ల్ చేశాడు.