KCR, జగన్ నెత్తిన లిక్కర్ స్కామ్.. కిక్కురుమనలేని దైన్యం!

విధాత‌: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేనిపోని తలనొప్పి వచ్చిపడింది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాములో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు లింకులు… అది కూడా ముఖ్యమంత్రి సన్నిహితులు, కుటుంబీకులకే సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు తేల్చడంతో ఇది పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అయింది. దీనిమీద ఆంధ్ర, తెలంగాణలో ప్రతిపక్షాలు విమర్శల వాన కురిపిస్తున్నా ఇటు నుంచి ఎదురుదాడి చేయలేని దైన్యం. ఈ స్కాముకు సంబంధించి ఈడీ అరెస్టు చేసిన వారిలో ఒకరు.. శరత్ […]

KCR, జగన్ నెత్తిన లిక్కర్ స్కామ్.. కిక్కురుమనలేని దైన్యం!

విధాత‌: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేనిపోని తలనొప్పి వచ్చిపడింది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాములో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు లింకులు… అది కూడా ముఖ్యమంత్రి సన్నిహితులు, కుటుంబీకులకే సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు తేల్చడంతో ఇది పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అయింది. దీనిమీద ఆంధ్ర, తెలంగాణలో ప్రతిపక్షాలు విమర్శల వాన కురిపిస్తున్నా ఇటు నుంచి ఎదురుదాడి చేయలేని దైన్యం.

ఈ స్కాముకు సంబంధించి ఈడీ అరెస్టు చేసిన వారిలో ఒకరు.. శరత్ చంద్రారెడ్డి. ఈయన ఆంధ్రాలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సొంత అల్లుడి సోదరుడు. ప్రస్తుతం ఈయన ప్రముఖ ఫార్మా కంపెనీ.. విశాఖలో భూముల వివాదంలో పేరు బయటకు వచ్చిన అరబిందో గ్రూపునకు డైరెక్టర్‌గా ఉన్నారు. తరచూ ట్విట్టర్లో, ఫేసుబుక్కులో టిడిపి మీద.. చంద్రబాబు.. లోకేష్ మీద తెగ పోస్టులతో విరుచుకుపడే సాయిరెడ్డి ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అరెస్టు నేపథ్యంలో కిక్కురుమనలేని పరిస్థితి.

ఇక ఆ తరువాత మొన్న ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్టు చేశారు. రానున్న ఎన్నికల్లో ఈ రాఘవరెడ్డి ఒంగోలు నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి. ఈ త‌రుణంలో రాఘవరెడ్డి అరెస్టు వైసీపీకి, జగన్‌కు తలనొప్పిగా మారింది. ఇక రాఘవ రెడ్డి అరెస్టు సమయంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ప్రస్తావించింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలక పాత్ర పోషించిందని ఇప్పటికే ఈడీ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూపులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా గ్రూప్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఉన్నట్లు పేర్కొంది. అంతే కాకుండా ఎమ్మెల్సీ కవిత వద్ద గతంలో ఆడిటర్‌గా పనిచేసిన గోరంటల్ బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసి విచారించింది.

అయితే తాజాగా కవిత పేరు కూడా చేర్చడంపై ఆ తరువాత ఏం జరుగుతోందనన్న చర్చ సాగుతోంది. ఇక ఇప్పుడు తెలంగాణలో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కేసీఆర్ మీద.. కవిత మీద ఆరోపణలు చేస్తున్నా ఎదురు చెప్పలేని పరిస్థితి.. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంల సన్నిహితులు.. పార్టీ వాళ్ళు ఒకేసారి.. ఒకే స్కాములో ఇరుక్కోవడం గమనార్హం.