Lloyds Bank | బ్రాంచుల మూసివేత మార్గంలో మరో బ్యాంకు.. యూకేలో ఇదీ పరిస్థితి
Lloyds Bank | విధాత: యూకే (UK)లో బ్రాంచ్‌ల సంఖ్యను తగ్గించుకుంటున్న బ్యాంకుల జాబితాలో ప్రముఖ సంస్థ లాయిడ్స్ బ్యాంక్ (Lloyds Bank) గ్రూప్ కూడా చేరింది. వినియోగదారులు చాలా మంది డిజిటల్ మార్గాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను సాగిస్తుండటంతో బ్రాంచుల అవసరం తగ్గిపోయినట్లు భావిస్తున్నట్లు ఈ సందర్భంగా యాజమాన్యం ప్రకటించింది. అయితే బ్యాంకులు ఈ కారణాన్ని చెప్పుకొని బ్రాంచులు మూత వేసే పరిస్థితి గత కొంత కాలంగా పెరగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధులకు, డిజిటల్ అక్షరాస్యత లేనివారిని […]

Lloyds Bank | విధాత: యూకే (UK)లో బ్రాంచ్‌ల సంఖ్యను తగ్గించుకుంటున్న బ్యాంకుల జాబితాలో ప్రముఖ సంస్థ లాయిడ్స్ బ్యాంక్ (Lloyds Bank) గ్రూప్ కూడా చేరింది. వినియోగదారులు చాలా మంది డిజిటల్ మార్గాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను సాగిస్తుండటంతో బ్రాంచుల అవసరం తగ్గిపోయినట్లు భావిస్తున్నట్లు ఈ సందర్భంగా యాజమాన్యం ప్రకటించింది.
అయితే బ్యాంకులు ఈ కారణాన్ని చెప్పుకొని బ్రాంచులు మూత వేసే పరిస్థితి గత కొంత కాలంగా పెరగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వృద్ధులకు, డిజిటల్ అక్షరాస్యత లేనివారిని బ్యాంకుల నుంచి ఇలాంటి విధానాలు దూరం చేస్తాయనే వాదన వినిపిస్తోంది.
ప్రస్తుతానికి మా వినియోగదారుల్లో 2 కోట్ల మంది పూర్తిగా డిజిటల్ బ్యాంకింగ్ చేస్తున్నారు. వృద్ధులు, ఇతర సమస్యలున్న వారికి ఇబ్బంది కలగకుండా కమ్యూనిటీ బ్యాంకర్స్‌ను నియమిస్తున్నాం. వారి లావాదేవీలు జరపడంలో వినియోగదారులకు సహకరిస్తారు అని లాయిడ్స్ వెల్లడించింది.
తాజా నిర్ణయంతో 2023లో సుమారు 155 లాయిడ్స్ బ్యాంక్ బ్రాంచులు మూతపడనున్నాయి. 2024లో మరో 40 శాఖల మూసివేత దిశగా రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. యూకేలో డిజిటల్ బ్యాంకింగ్ ప్రవేశించిన గత దశాబ్ద కాలంలో అన్ని బ్యాంకులకు సంబంధించి వేల బ్యాంకు బ్రాంచులు మూత పడటం గమనార్హం.