దేశ­ప్ర­జలు 2023లో చేసిన అప్పు 45,51,584 కోట్లు

దేశంలో ప్ర‌జ‌లు వివిధ అవ‌స‌రాల నిమిత్తం బ్యాంకుల నుంచి 2023లో 45.51 ల‌క్ష‌ల కోట్ల రుణాలు తీసుకున్నార‌ని ఆర్బీఐ గ‌ణాంకాలు వెల్ల‌డిస్తున్నాయి.

దేశ­ప్ర­జలు 2023లో చేసిన అప్పు 45,51,584 కోట్లు

ఆర్బీఐ గణాం­కాల వెల్లడి.. సింహ­భాగం వ్యక్తి­గత రుణాలే

విధాత‌, హైద‌­రా­బాద్: ఈ ఏడాది దేశ ప్రజలు వివిధ ఆర్థిక సంస్థల నుంచి వ్యక్తి­గత, వాహన, గృహ, విద్య తది­తర పేర్లతో 45,51,584 కోట్లు రుణా­లుగా తీసు­కు­న్నా­రని ఆర్బీఐ నివే­దిక వెల్ల­డిం­చింది. గృహ‌, వ్య‌క్తి­గ‌త‌, వాహ‌న‌, క్రెడిట్ కార్డుల రుణాల్లో 92 శాతం పూచీ­క‌త్తు లేని రుణాలు ఉన్నా­య‌ని ఆర్బీఐ ప్ర‌క‌­టిం­చింది. ఆర్బీఐ ప్ర‌క­టిం­చిన లెక్క‌ల ప్ర‌కారం న‌వం­బ‌ర్‌, 2023 నాటికి రిటైల్ రుణాలు 18 శాతం, వ్య‌క్తి­గ‌త రుణాల్లో 22 శాతం, క్రెడిట్ కార్డుల రుణాల్లో 28 శాతం పెరి­గాయి. దేశంలో 94 మిలి­య‌న్ల క్రెడిట్ కార్డులు ఉండ‌గా స‌గ‌­టున రూ.5,577 కోట్ల విలువ మేరకు లావా­దే­వీలు జ‌రి­గాయి.


ప్ర‌జ‌లు వివిధ ఆర్థిక సంస్థ‌ల నుంచి రూ.1.71 ల‌క్ష‌ల కోట్ల మేరకు వ్య‌క్తి­గ‌త రుణాలు తీసు­కు­న్నట్లు ఆర్బీఐ గ‌ణాం­కాలు చెబు­తు­న్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపె­నీలు (ఎన్బీ­ఎ­ఫ్‌సీ) ఎలాంటి పూచీ­క‌త్తు లేకుండా క్రెడిట్ కార్డులు, వ్య‌క్తి­గ‌త రుణాలు, విని­యోగ వ‌స్తు­వుల కొను­గో­లుకు అప్పులు మంజూరు చేశాయి. ఈ విధ‌­మైన అప్పులు మంజూరు చేయ‌­డంతో రెట్టింపు స్థాయిలో క్యాపి­టల్ పెట్టు­బ‌­డులు స‌మ‌­కూ­ర్చు­కో­వా­ల్సిన ప‌రి­స్థి­తులు ఎన్బీ­ఎ­ఫ్‌­సీ­ల‌కు ఏర్ప‌­డ్డాయి. ప్ర‌ధా­నంగా నాలుగు రంగా­ల‌లో అత్య‌­ధి­కంగా రుణాలు పంపిణీ చేశారు. 2023 గృహ రుణాలు రూ.21.44,376 కోట్లు, వాహ‌న రుణాలు రూ.5.53,154 కోట్లు పంపిణీ జ‌రి­గింది. ఆర్బీఐ వెల్ల‌­డిం­చిన వివ‌­రాల ప్ర‌కారం 2021 సంవ‌­త్స‌­రంలో రుణాలు రూ.31,99,948 కోట్లు ఉండ‌గా 2022 సంవ‌­త్స‌­రా­నికి 38,55,873 కోట్లుగా ఉన్నది. 2023లో సంవ‌­త్స‌రం న‌వం­బ‌ర్ చివ‌రి నాటికి 45,51,584 కోట్ల అప్పులు చేశారు. 2021 సంవ‌­త్స‌­రంలో 20.5 శాతం పెర‌గ్గా, 2022లో 18 శాతం మేర పెరి­గాయి.


గృహ రుణాలు 2021లో రూ.16,05,562 కోట్లు ఉండ‌గా, మ‌రు­స‌టి ఏడాది అన‌గా 2022లో రూ.18,73,413 కోట్లు, 2023లో రూ.21,44,376 కోట్లుగా ఉన్నది. పెరి­గింది. వ్య‌క్తి­గ‌త రుణాలు 2021లో రూ.8,24,085 కోట్లు, 2022లో రూ.10,29,723 కోట్లు, 2023లో రూ.12,59,170 కోట్లు ఇచ్చారు. వాహ‌న రుణాలు 2021లో రూ.3,78,026 కోట్లు, 2022లో రూ.4,60,871 కోట్లు, 2023లో 5,53,154 కోట్లు తీసు­కు­న్నారు. క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు 2021లో రూ.1,45,353 కోట్లు, 2022లో రూ.1,88,033 కోట్లు, 2023లో 2,40,656 కోట్లు తీసు­కు­న్న‌ట్లు ఆర్బీఐ ప్ర‌క‌­టిం­చింది. ఫిక్స్‌డ్‌ డిపా­జి­ట్ల‌పై రుణాలు, విద్యా రుణాలు, బంగారం త‌న‌ఖా రుణాలు, విని­యోగ వ‌స్తు­వుల రుణాలు, సెక్యు­రిటీ త‌న‌ఖా రుణాల్లో కూడా పెరు­గు­ద‌ల ఉంద‌రి ఆర్బీఐ లెక్క‌లు స్ప‌ష్టం చేస్తు­న్నాయి.