Girl Molest | విద్యార్థినికి పోలీసు కానిస్టేబుల్ లైంగిక వేధింపులు..
Girl Molest | ఓ పోలీసు కానిస్టేబుల్ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ విద్యార్థిని స్కూల్ నుంచి తన సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. ఓ పోలీసు కానిస్టేబుల్ ఆ విద్యార్థినిని యాక్టివాపై ఫాలో అయ్యాడు. ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ మహిళ.. స్కూటీపై వెళ్తూ ఆ దృశ్యాలను […]

Girl Molest | ఓ పోలీసు కానిస్టేబుల్ ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ విద్యార్థిని స్కూల్ నుంచి తన సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. ఓ పోలీసు కానిస్టేబుల్ ఆ విద్యార్థినిని యాక్టివాపై ఫాలో అయ్యాడు. ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఓ మహిళ.. స్కూటీపై వెళ్తూ ఆ దృశ్యాలను తన మొబైల్‌లో చిత్రీకరించింది.
వెనుకాల వస్తున్న ఓ మహిళ వీడియో చిత్రీకరించడాన్ని గమనించిన కానిస్టేబుల్ తన యాక్టివాను ఆపాడు. ఎందుకు వీడియో తీస్తున్నారని ప్రశ్నించాడు. ఆ అమ్మాయి తన కూతురు ఫ్రెండ్ అని బుకాయించాడు. మొత్తంగా ఈ ఘటన మంగళవారం చోటు చేసుకోగా, వీడియో బుధవారం వైరల్ అయింది.
ఈ వీడియో ఆధారంగా పోలీసు కానిస్టేబుల్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఆ అమ్మాయిని లైంగిక వేధిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మొబైల్ నంబర్ ఇవ్వాలని ఆ విద్యార్థినిపై ఒత్తిడి చేసినట్లు తేలింది. నిందితుడు మోహన్‌లాల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.