Madhya Pradesh | గాయ‌ప‌డ్డ చిరుత‌తో గ్రామ‌స్థుల ఆట‌లు.. సెల్ఫీలు దిగుతూ హింసించారు..

Madhya Pradesh | విధాత‌: చిరుత పులి అంటేనే శ‌రీరంలో వ‌ణుకు పుడుతోంది. కానీ గాయ‌ప‌డ్డ ఓ చిరుత‌తో గ్రామ‌స్థులు ఆడుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇక్లేరా గ్రామ స‌మీపంలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. దేవాస్ జిల్లాలోని ఇక్లేరా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ చిరుత పులి ఇటీవ‌ల సంచ‌రించింది. ఆ చిరుత‌ను చూసి స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. కానీ అది నెమ్మ‌దిగా క‌దులుతుండ‌టంతో.. గాయ‌ప‌డింద‌ని గ్రామ‌స్థులు నిర్ధారించారు. దీంతో ఆ చిరుత వ‌ద్ద‌కు వెళ్లిన […]

  • By: Somu    latest    Aug 30, 2023 12:18 PM IST
Madhya Pradesh | గాయ‌ప‌డ్డ చిరుత‌తో గ్రామ‌స్థుల ఆట‌లు.. సెల్ఫీలు దిగుతూ హింసించారు..

Madhya Pradesh | విధాత‌: చిరుత పులి అంటేనే శ‌రీరంలో వ‌ణుకు పుడుతోంది. కానీ గాయ‌ప‌డ్డ ఓ చిరుత‌తో గ్రామ‌స్థులు ఆడుకున్నారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇక్లేరా గ్రామ స‌మీపంలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. దేవాస్ జిల్లాలోని ఇక్లేరా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఓ చిరుత పులి ఇటీవ‌ల సంచ‌రించింది. ఆ చిరుత‌ను చూసి స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

కానీ అది నెమ్మ‌దిగా క‌దులుతుండ‌టంతో.. గాయ‌ప‌డింద‌ని గ్రామ‌స్థులు నిర్ధారించారు. దీంతో ఆ చిరుత వ‌ద్ద‌కు వెళ్లిన స్థానికులు.. ఆడుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఓ పెంపుడు జంతువు మాదిరిగా దాన్ని ట్రీట్ చేశారు. ఇక ఏకంగా ఓ వ్య‌క్తి ఆ చిరుత‌పై కూర్చొని రైడ్ చేసేందుకు య‌త్నించాడు.

గాయ‌ప‌డ్డ చిరుత గురించి కొంత మంది స్థానికులు అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఉజ్జ‌యిని నుంచి రెస్క్యూ టీమ్ ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని చిరుత‌ను చేర‌దీసి, సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. రెండేండ్ల వ‌య‌సున్న‌ ఆ చిరుత‌ను చికిత్స కోసం భోపాల్‌లోని వ‌న్ విహార్ తీసుకువెళ్లిన‌ట్లు ఫారెస్ట్ ఆఫీస‌ర్ సంతోష్ శుక్లా తెలిపారు. ఆ చిరుతు కండీష‌న్ ప్రస్తుతం క్రిటిక‌ల్‌గా ఉంద‌ని పేర్కొన్నారు.