హైదరాబాద్ ఓయూలో మళ్లీ ఉద్రిక్తత
విధాత: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఉస్మానియా యూనివర్సిటీ రెండు రో జులుగా అట్టుడుకుతుంది. ఉస్మానియా విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి రెండవ రోజులు చేపట్టిన నిరుద్యోగ నిరసనదీక్ష ఉద్రిక్తంగా మారింది. నిరసనలో పాల్గొనడానికి క్యాంపస్‌లో గుమిగూడిన విద్యార్థులను ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఓయూ క్యాంపస్‌లో పరిస్థితులు ఉద్రికత్తంగా మారాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తూ నిరసనలు నిర్వహించారు. పేపర్ […]

విధాత: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఉస్మానియా యూనివర్సిటీ రెండు రో జులుగా అట్టుడుకుతుంది. ఉస్మానియా విద్యార్థుల ఐక్య కార్యాచరణ సమితి రెండవ రోజులు చేపట్టిన నిరుద్యోగ నిరసనదీక్ష ఉద్రిక్తంగా మారింది. నిరసనలో పాల్గొనడానికి క్యాంపస్‌లో గుమిగూడిన విద్యార్థులను ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఓయూ క్యాంపస్‌లో పరిస్థితులు ఉద్రికత్తంగా మారాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తూ నిరసనలు నిర్వహించారు. పేపర్ లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీపేపర్ల లీక్‌ను నిరసిస్తూ వెంటనే చైర్మన్ జనార్దన్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీపై విద్యార్థులు జ్యుడిషియల్ విచారణకు పట్టుబడుతున్నారు. రెండు రోజులు ఆర్ట్ కాలేజీ ఎదుట మహాదర్నాకు పిలుపు నిచ్చారు. దీనికి అనుమతి లేదని యూనివర్సిటీ అధికారులు చెబుతుండగా, దీక్ష చేస్తే అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా దీక్ష చేసి తీరుతామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.
క్యాంపస్‌లోకి ప్రతిపక్ష నాయకులు వస్తే అడ్డుకుంటామని అధికార పార్టీ విద్యార్థి సంఘం చెప్పగా, వామపక్ష విద్యార్థి సంఘాలు వారి రాకను స్వాగతిస్తున్నాయి. ఈ క్రమంలోనే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇంటి వద్ద అరెస్టు చేశారు. విద్యార్థులు ఇచ్చిన మహాధర్నా శనివారం కూడా ఉండడంతో ఓయూలో పోలీసులను భారీగా మోహరించారు. నిరసనదీక్షలో పాల్గొనడానికి వెళ్లిన విద్యార్థులను అడ్డకొని పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా పోలీసులు విద్యార్థులను వ్యాన్లలోకి ఎక్కించారు.