WARANGAL: శివాలయాలకు.. మహాశివరాత్రి ఉత్సవశోభ
కాళేశ్వరం,వేయిస్తంభాలగుడి,రామప్ప, పాలకుర్తి,కురవి దేవాలయాల ముస్తాబు భక్తులకు తగిన విధంగా ఏర్పాట్లు అధికార, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవ శోభను సంతరికున్నాయి. ఈనెల 18 నిర్వహించుకునే శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కాళేశ్వరం, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి, ములుగు రామప్ప, కురవి వీరభద్ర స్వామి దేవాలయంతో పాటు చిన్నాపెద్దా శివాలయాలు, ఇతర దేవాలయాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో దేవాలయాలను, పరిసరాలను అలంకరించారు. లోపల పూలతో […]

- కాళేశ్వరం,వేయిస్తంభాలగుడి,రామప్ప, పాలకుర్తి,కురవి దేవాలయాల ముస్తాబు
- భక్తులకు తగిన విధంగా ఏర్పాట్లు
- అధికార, ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవ శోభను సంతరికున్నాయి. ఈనెల 18 నిర్వహించుకునే శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కాళేశ్వరం, వేయి స్తంభాల గుడి, పాలకుర్తి, ములుగు రామప్ప, కురవి వీరభద్ర స్వామి దేవాలయంతో పాటు చిన్నాపెద్దా శివాలయాలు, ఇతర దేవాలయాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు.
విద్యుత్ దీపాలతో దేవాలయాలను, పరిసరాలను అలంకరించారు. లోపల పూలతో అలంకరించారు. భక్తుల కోసం విస్తృతస్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నీడ కోసం టెంట్లు, చలువ పందిళ్లు వేస్తున్నారు. భక్తులు క్యూ లైన్ లో వెళ్లి దైవదర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాటు చేస్తున్నారు. మంచినీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు.
ప్రసిద్ధ దేవాలయాలలో ఏర్పాట్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి, వేయి స్తంభాల గుడిలో శంబులింగేశ్వరుడు, పాలకుర్తి లోని సోమేశ్వర దేవాలయం, రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి. ఈ దేవాలయాలకు లక్ష నుంచి 50 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే దేవాలయాలను ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రులు పర్యవేక్షించారు.
పాలకుర్తిలో ఇద్దరు మంత్రులు
పాలకుర్తి సోమేశ్వర స్వామి దేవాలయంలో చండికా అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. వేయి స్తంభాల దేవాలయంలో ప్రధాన పూజారి గంగు ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి. కాలేశ్వరం ముక్తేశ్వరాలయంలో ఈవో మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. ములుగు రామప్ప రామలింగేశ్వర దేవాలయంలో తగిన ఏర్పాటు చేస్తున్నారు.
కాళేశ్వరంలో ఏర్పాట్లు పూర్తి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి దేవస్థానం 17 నుండి 19 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై ఈవో మహేష్ మాట్లాడుతూ 17 ఉదయం స్వామివారిని పెండ్లికొడుకును చేస్తారన్నారు. 18 న మహాశివరాత్రి రోజు స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. శనివారం శని త్రయోదశి, మహాశివరాత్రి కావడంతో సుమారు లక్షమంది భక్తులు దేవుని దర్శనం చేసుకుంటారని చెప్పారు. దాదాపు లక్ష మంది భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.