మానసిక ఒత్తిడి.. పురుషాంగాన్ని కోసుకున్న వ్యక్తి
విధాత: ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై పురుషాంగాన్ని కోసుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో బాధ పడుతున్న అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లో వెలుగు చూసింది. దృశ్యం చిన్నది ఇప్పుడు ఎలా ఉందో చూశారా.. బనగాన్ జిల్లాకు చెందిన శ్యామల్ ముండా కొంత కాలం నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఐతే ఇటీవలే తన సోదరుడు బాత్రూంలోకి వెళ్లి చూడగా రక్తపు మరకలు కనిపించాయి. ఆందోళనకు గురైన […]

విధాత: ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై పురుషాంగాన్ని కోసుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో బాధ పడుతున్న అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లో వెలుగు చూసింది.
బనగాన్ జిల్లాకు చెందిన శ్యామల్ ముండా కొంత కాలం నుంచి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఐతే ఇటీవలే తన సోదరుడు బాత్రూంలోకి వెళ్లి చూడగా రక్తపు మరకలు కనిపించాయి. ఆందోళనకు గురైన అతను కంగారుగా ఇంట్లోకి వచ్చి తల్లిదండ్రులకు చెప్పాడు. అనుమానంతో శ్యామల్ గదిలోకి వెళ్లి చూడగా రక్తం కనిపించింది. కంగారుగా అతన్ని పరిశీలించగా పురుషాంగం కోసుకున్నట్లు తేలింది.
దీనితో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బనగాన్ ఆసుపత్రికి తరలించారు. శ్యామల్ పరిస్థితి విషమంగా ఉంది. ఐతే మానసిక ఒత్తిడి కారణంగానే ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కూరగాయలు కట్ చేసే కత్తితో పురుషాంగాన్ని కోసుకున్నాడని, దానికి రక్తపు మరకలు అంటుకున్నాయని పేర్కొన్నారు.