భార్య సమాధి వద్ద నివాళులర్పిస్తుండగా భర్తకు గుండెపోటు.. కూతురు అంత్యక్రియలు
విధాత: భార్య సమాధి వద్ద నివాళులర్పిస్తుండగా భర్త గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డికి చెందిన నిమ్మ ప్రభాకర్ (59) ఇరవై ఏండ్ల క్రితం సంగారెడ్డికి వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డాడు. రెండేండ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందగా ఎల్లారెడ్డిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీలో అనుమతి కోసం ప్రభాకర్ గురువారం ఎల్లారెడ్డికి వచ్చాడు. అయితే తన వ్యవసాయ భూమిలో ఉన్న భార్య […]

విధాత: భార్య సమాధి వద్ద నివాళులర్పిస్తుండగా భర్త గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డికి చెందిన నిమ్మ ప్రభాకర్ (59) ఇరవై ఏండ్ల క్రితం సంగారెడ్డికి వెళ్లి అక్కడే వ్యాపారంలో స్థిరపడ్డాడు.
రెండేండ్ల క్రితం భార్య అనారోగ్యంతో మృతిచెందగా ఎల్లారెడ్డిలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నిర్మాణానికి మున్సిపాలిటీలో అనుమతి కోసం ప్రభాకర్ గురువారం ఎల్లారెడ్డికి వచ్చాడు. అయితే తన వ్యవసాయ భూమిలో ఉన్న భార్య సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు ప్రభాకర్ వెళ్లాడు.
భార్యకు నివాళులర్పిస్తూనే భర్త కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రభాకర్‌కు ముగ్గురు కూతుళ్లు కాగా, ఇద్దరికి వివాహమైంది. కొడుకులు లేక పోవడంతో మూడో కూతురు తండ్రికి కర్మకాండ నిర్వహించింది.