ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వధువు కావలెను.. కట్నం ఇచ్చేందుకు రెడీ..
Madhya Pradesh | ఈ భూమ్మీద పెళ్లి కాని ప్రసాదులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పెళ్లి కాని ప్రసాదులు.. కట్నం లేకుండా పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. అవసరమైతే వధువుకే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వధువు కావలెను. తిరిగి కట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ యువకుడు పోస్టర్‌తో నడి బజార్లో ప్రత్యక్షమయ్యాడు. ఆ యువకుడి పోస్టర్‌ను చూసిన స్థానికులు […]

Madhya Pradesh | ఈ భూమ్మీద పెళ్లి కాని ప్రసాదులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి పెళ్లి కాని ప్రసాదులు.. కట్నం లేకుండా పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. అవసరమైతే వధువుకే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
తనకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వధువు కావలెను. తిరిగి కట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఓ యువకుడు పోస్టర్‌తో నడి బజార్లో ప్రత్యక్షమయ్యాడు. ఆ యువకుడి పోస్టర్‌ను చూసిన స్థానికులు నవ్వుకున్నారు. అమ్మాయిలు అయితే ముసిముసి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయారు.
ఈ సంఘటన మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలోని ఫౌంటేన్ చౌక్ మార్కెట్లో జనవరి 22న జరిగింది. చార్ పఠాక్ ఏరియాకు చెందిన వికల్ప్ మాలవీయ.. మార్కెట్లో ప్రత్యక్షమై పోస్టర్‌ను ప్రదర్శించడంతో అందరి దృష్టి అతని వైపు మళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
सरकारी नौकरी वाली लड़की से शादी के लिए लड़का दहेज देने को भी तैयार है…
MP के छिंदवाड़ा की तस्वीर है… pic.twitter.com/xfOa2qiT4Y
— Naveen Singh (@Naveen_K_Singh_) January 25, 2023