మైనర్‌పై లైంగికదాడి.. నిందితుడికి 142 ఏండ్ల జైలు శిక్ష
విధాత: ఓ పదేండ్ల బాలికపై రెండేండ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి కోర్టు 142 ఏండ్ల జైలు శిక్ష విధించింది. కేరళలోని పట్టణమిట్ట జిల్లాలో పదేండ్ల బాలికపై దగ్గరి బంధువు కన్నేశాడు. 2019-21 మధ్య కాలంలో బాలికపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపడటంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పట్టణమిట్ట అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు జడ్జి జయకుమార్ నిన్న తీర్పును వెల్లడించారు. 41 ఏండ్ల […]

విధాత: ఓ పదేండ్ల బాలికపై రెండేండ్ల పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడికి కోర్టు 142 ఏండ్ల జైలు శిక్ష విధించింది. కేరళలోని పట్టణమిట్ట జిల్లాలో పదేండ్ల బాలికపై దగ్గరి బంధువు కన్నేశాడు. 2019-21 మధ్య కాలంలో బాలికపై అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ విషయం బయటపడటంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పట్టణమిట్ట అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ కోర్టు జడ్జి జయకుమార్ నిన్న తీర్పును వెల్లడించారు. 41 ఏండ్ల నిందితుడికి 142 ఏండ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చారు.
రూ. 5 లక్షల జరిమానా కూడా విధించారు. పట్టణమిట్టలో పోక్సో కేసుల్లో రికార్డ్ పనిష్‌మెంట్ ఇదే. అయితే ఈ కేసులో నిందితుడు 60 ఏండ్ల జైలు శిక్ష అనుభవించనున్నట్లు పోలీసులు ప్రకటించారు.