ఇదేంటీ విమానం గాల్లో ఉండగా ఆత్మహత్యాయత్నమా?వెంటనే ఏం జరిగిందంటే!
ఇప్పటివరకు మనం ఆత్మహత్య ప్రయత్నాలు, ఇండ్లలోను, ట్రైన్లలోను, బ్రిడ్జిలపైన, ఇంకా నేలపై ఇతరత్రా చోట్ల విన్నాం కానీ, మరి గాల్లో కూడా ఆత్మాహత్యా

బ్యాంకాక్ : ఇప్పటివరకు మనం ఆత్మహత్య ప్రయత్నాలు, ఇండ్లలోను, ట్రైన్లలోను, బ్రిడ్జిలపైన, ఇంకా నేలపై ఇతరత్రా చోట్ల విన్నాం కానీ, మరి గాల్లో కూడా ఆత్మాహత్యా ప్రయత్నమా అని చూసిన వాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేం చావు తెలివిరా నాయనా అని విస్తుబోతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తైవాన్‌కు చెందిన ఇవా ఎయర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకున్నది. విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దాంతో విమానంలో అంతా గందరగోళం ఏర్పడింది. అందరి ప్రాణాలకు ఆయన పుణ్యమాని ముప్పు ఏర్పడినట్లైంది. దీంతో వెంటనే విమానాన్ని దారి మళ్లించి, అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ ఘటన శుక్రవారం మార్చి 15న జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే ఆ ప్రబుద్దిడి (ప్రయాణికుడి) వివరాలు, ఆత్మహత్య ప్రయత్నానికి గల కారణాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీఆర్ 67 ఫ్లైట్ మార్చి 15న, బ్యాంకాక్ నుంచి లండన్ బయలుదేరింది. విమానం వేగంగా గాల్లోకి దూసుక పోతుంది. అదే సమయంలో విమానంలో వున్నట్టుండి ఓ ప్రయాణికుడు వాష్ రూమ్‌లోకి వెళ్లి, ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఇది గమనించిన విమాన సిబ్బంది, వాష్ రూమ్‌లోకి వెళ్లి చూడగా, అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు. లండన్ వెళ్లాల్సిన విమానాన్ని ఆయన చికిత్స నిమిత్తం దారి మళ్ళించి, హిత్రూ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనను ఇవా ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే ప్రయాణికుని వివరాలు మాత్రం వెల్లడించలేదు.