Manchu Lakshmi: పిల్లల గురించి మంచు లక్ష్మీ ఎమోషనల్ కామెంట్స్..మనోజ్, మౌనిక పిల్లలపై కూడా కామెంట్
Manchu Lakshmi: తెలుగు వెండితెర, బుల్లితెరపై తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు మంచు లక్ష్మీ. ఆమె మోహన్ బాబు డాటర్ అయినా కూడా తన నటనతోనే ఎక్కువ అభిమానుల్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా, విలన్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఇలా ఎన్నో క్యారెక్టర్లతో తన ఇమేజ్ ను పాపులర్ చేసుకుంది. ఇక రీసెంట్ గా తన తమ్ముడు మనోజ్ మంచుకు తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించి పెళ్లి పెద్దగా […]

Manchu Lakshmi: తెలుగు వెండితెర, బుల్లితెరపై తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు మంచు లక్ష్మీ. ఆమె మోహన్ బాబు డాటర్ అయినా కూడా తన నటనతోనే ఎక్కువ అభిమానుల్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా, విలన్ గా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఇలా ఎన్నో క్యారెక్టర్లతో తన ఇమేజ్ ను పాపులర్ చేసుకుంది. ఇక రీసెంట్ గా తన తమ్ముడు మనోజ్ మంచుకు తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిపించి పెళ్లి పెద్దగా మారింది. భూమా మౌనికకు కూడా ఇది రెండో పెళ్లి కావడంతో తనకు ఇప్పటికే బాబు ఉన్నాడు. రీసెంట్ గా వీళ్లిద్దరూ పిల్లల్ని కనే విషయంలో క్లారిటీ ఇచ్చింది మంచు లక్ష్మీ.
ఆమె మాట్లాడుతూ.. ఆమె యాదాద్రి వెళ్లినప్పుడు మనోజ్ పెళ్లికి వాళ్ల నాన్న ఒప్పుకోవాలని.. పెళ్లి జరగాలని కోరుకున్నానని దేవుడు కనికరించినట్లు నాన్న ఒప్పుకున్నారని, పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా జరిగిందని అన్నారు. ఇప్పుడు మౌనిక, తాను చాలా క్లోజ్ అయ్యామని.. మనోజ్ పై ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా తనకే వచ్చి చెబుతుందని అన్నారు. ఇప్పుడు మనోజ్ కన్నా కూడా మౌనికనే ఎక్కువ అంటున్నారు మంచు లక్ష్మీ. ఇక మౌనిక కూడా చాలా స్మార్ట్ అని. ఆమె చాలా సింపుల్, అండ్ కూల్ గా ఉంటుందని అన్నారు. అయితే తనకు ఒక బేబి కావాలని అడిగిందట.
మంచు లక్ష్మీకి పిల్లలంటే చాలా ఇష్టం అని, తన ఇంట్లో ఇప్పటికే తన పాపతో కలిపి ఐదుగురు ఉంటారని అంటున్నారు. అయితే మంచు లక్ష్మీ నలుగురిని కనాలని అనుకున్నానని, కానీ కుదర్లేదని అన్నారు. ఇక పిల్లలపై ప్రేమతోనే స్కూల్స్ ని దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నో సందర్భాల్లో పిల్లల గురించి ఎమోషనల్ అయ్యారు మంచు లక్ష్మీ. కాని ఆమెది పిల్లల విషయంలో చాలా మంచి మనసు అని అంటున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా మంచు లక్ష్మీ సోదరుడు మనోజ్, మౌనికలు మళ్లీ పిల్లల్ని కనేందుకు రెడీగా ఉన్నారని మంచు లక్ష్మీ గుడ్ న్యూస్ అయితే చెప్పేశారు.