మంచు మనోజ్, భూమా మౌనికల మ్యాటర్‌కి ఫుల్ ‌స్టాప్ పడబోతోందా?

విధాత‌, సినిమా: మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి కలిసి ఇటీవల ఓ గణేషుని మండపం వద్ద దర్శనమివ్వడంతో.. రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వారిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనేది ఆ వార్తలలోని సారాంశం. అయితే ఇంతలా వార్తలు వినిపిస్తున్నా.. ఇరు ఫ్యామిలీలోని ఏ ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేదు.. కనీసం ఈ వార్తలో నిజం లేదని ఖండించనూ లేదు. దీంతో.. ఈ వార్త నిజమే అనేలా అందరిలోకి వెళ్లిపోయింది. […]

మంచు మనోజ్, భూమా మౌనికల మ్యాటర్‌కి ఫుల్ ‌స్టాప్ పడబోతోందా?

విధాత‌, సినిమా: మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి కలిసి ఇటీవల ఓ గణేషుని మండపం వద్ద దర్శనమివ్వడంతో.. రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వారిద్దరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనేది ఆ వార్తలలోని సారాంశం. అయితే ఇంతలా వార్తలు వినిపిస్తున్నా.. ఇరు ఫ్యామిలీలోని ఏ ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేదు.. కనీసం ఈ వార్తలో నిజం లేదని ఖండించనూ లేదు.

దీంతో.. ఈ వార్త నిజమే అనేలా అందరిలోకి వెళ్లిపోయింది. అంతేకాదు, చంద్రబాబు అంటే పడని మోహన్ బాబు.. మళ్లీ ఆయనతో సమావేశమవడం కూడా ఈ వార్తకు మరింత బలాన్నిచ్చింది. అయితే ఎన్ని వార్తలు వచ్చినా.. ఏం జరిగినా.. ఇరు ఫ్యామిలీలు సైలెంట్‌గానే ఉండటం ఏమిటనేదే ఇప్పుడందరికీ అర్థం కాని విషయం.

రెండు ఫ్యామిలీల వెనుక చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండే ఉంది. సమాజంలో కాస్త పేరున్న ఫ్యామిలీలే. అలాంటి ఫ్యామిలీలపై ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరైతే స్పందించి.. నిజమైతే నిజమని చెప్పడమో.. లేదంటే రూమర్స్ అని ఖండించడమో చేయాలి. కానీ ఎవరూ ఈ విషయంపై స్పందించకుండా మీడియాకు మరింత పని కల్పిస్తున్నారు.

వాస్తవానికి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. చదువుకునే ఏజ్‌లోనే మనోజ్, మౌనికలు ప్రేమించుకున్నారని.. వారి ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పడంతో.. ఇద్దరూ వేరువేరుగా పెళ్లిళ్లు చేసుకున్నారని అనుకుంటున్నారు. అంతేకాదు, ఇద్దరూ తమ మొదటి పెళ్లికి సంబంధించి విడాకులు తీసుకుని.. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారనేలా కూడా టాక్ నడుస్తుంది.

అందుకే మనోజ్ ఈ మధ్య అసలు బయటికి రావడం లేదని, చేస్తున్న సినిమా కూడా ఆపేశాడనేలా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యారని, ఇరు ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒప్పించారని, త్వరలోనే సింపుల్‌గా పెళ్లి కూడా చేసుకోబోతున్నారనేది తాజా సమాచారం.

అంతేకాదు, మంచు మనోజ్-భూమా మౌనికల రిలేషన్‌కు సంబంధించి ఫస్ట్ టైమ్.. భూమా ఫ్యామిలీ నుంచి ఒకరు మీడియా ముందుకు రాబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. భూమా నాగిరెడ్డి కొడుకు, భూమా మౌనిక అన్నయ్య అయిన భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి.. త్వరలో మీడియా సమావేశాన్ని నిర్వహించి.. అసలు విషయం ఏమిటనేది చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ సమావేశం తర్వాతే.. ఇప్పటివరకు వినిపిస్తున్న చాలా వార్తలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.