మౌనిక.. నా జీవితంలోకి రావడం అదృష్టం: రెండో పెళ్లిపై మంచు మనోజ్

Manchu Manoj విధాత‌: మంచు మనోజ్ మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 3, 4 తేదీలలో ఆయన పెళ్లి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డి‌తో మనోజ్ రెండో పెళ్లి జరగనుండటం అభిమానులలో కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో […]

  • By: krs    latest    Mar 01, 2023 10:49 AM IST
మౌనిక.. నా జీవితంలోకి రావడం అదృష్టం: రెండో పెళ్లిపై మంచు మనోజ్

Manchu Manoj

విధాత‌: మంచు మనోజ్ మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 3, 4 తేదీలలో ఆయన పెళ్లి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. దివంగత రాజకీయ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. భూమా మౌనిక రెడ్డి‌తో మనోజ్ రెండో పెళ్లి జరగనుండటం అభిమానులలో కూడా సంతోషాన్ని కలిగిస్తుంది.

గత కొంతకాలంగా వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్‌షిప్‌లో ఉండగా.. గత సంవత్సరం వినాయక చవితి పండుగ సందర్భంగా వీరిద్దరూ కలిసి వినాయకుడి మండపంలో ప్రత్యేకంగా పూజలు చేయడంతో వారి రిలేషన్ బయట పడింది.

అప్పటి నుంచి వీరి వివాహానికి సంబంధించి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది. ప్రస్తుతం పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయి.

మనోజ్ సన్నిహితులు చెబుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే మనోజ్ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తుంది.

కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగబోతోంది. ఇలా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో తాజాగా మనోజ్ భూమా మౌనిక‌తో ఉన్న రిలేషన్‌కి సంబంధించి స్పందిస్తూ.. మా మ‌ధ్య మంచి స్నేహ‌బంధం ఉండేది..అయితే ఆ బంధం ప్రేమగా మారింది. వివాహానికి దారి తీసింది. కష్ట సమయాలలో నాకు భూమా మౌనిక ఎంతో అండగా నిలిచారు. ఆమె నా జీవితంలోకి రావడం నా అదృష్టం అని చెప్పినట్లుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.