Manjeera Pushkaralu | భ‌క్తుల‌తో.. పుల‌క‌రించిన గరుడ గంగ మంజీర

Manjeera Pushkaralu పుష్కరాలకు హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి మహిళలు గంగామాతకు దీపాలంకరణ. విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మండలం పేరూరు గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన సరస్వతి మాత దేవాలయం భ‌క్తుల‌తో కిక్కిరిసింది. భక్తుల తాకిడితో మంజీరా పులకరించిపోతుంది. భక్తులు నది స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు గంగానదికి దీపాలు సమర్పించి గంగా హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. నదిలో శివలింగానికి అభిషేకం నిర్వహిస్తున్నారు. విభూది […]

Manjeera Pushkaralu | భ‌క్తుల‌తో.. పుల‌క‌రించిన గరుడ గంగ మంజీర

Manjeera Pushkaralu

  • పుష్కరాలకు హాజరైన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతాలక్ష్మారెడ్డి
  • మహిళలు గంగామాతకు దీపాలంకరణ.

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ మండలం పేరూరు గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున వెలసిన సరస్వతి మాత దేవాలయం భ‌క్తుల‌తో కిక్కిరిసింది. భక్తుల తాకిడితో మంజీరా పులకరించిపోతుంది. భక్తులు నది స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

ముఖ్యంగా మహిళలు గంగానదికి దీపాలు సమర్పించి గంగా హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. నదిలో శివలింగానికి అభిషేకం నిర్వహిస్తున్నారు. విభూది గుండం ను దర్శించుకొని, అనంతరం సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు.

మహిళా కమిషన్ చైర్మన్ రాక

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా రెడ్డి గురువారం పుష్కరాలకు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. మంజీర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంత‌రం సరస్వతి మాతను ద‌ర్శించుకున్నారు.

ఆలయ పూజారి దూర్బాల రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో మహిళా కమిషన్ చైర్మన్‌ను సత్కరించారు. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. కార్యక్రమంలో నిర్వాహకులు దినాకర్ శర్మ, మహేష్ శర్మ, ఇతర పూజారులు పాల్గొన్నారు.