Manukota | మానుకోట జిల్లాలో BRSకు తొలి షాక్.. గార్ల ZPTC ఝాన్సీ రాజీనామా
Manukota, ZPTC, PONGULETI, BRS ఒక్కో అడుగేస్తున్న పొంగులేటి పక్క జిల్లాలో పట్టు కోసం ప్రయత్నం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట (Manukota) జిల్లా గులాబీ పార్టీకి పొంగులేటి నుంచి తొలి షాక్ తగిలింది. మానుకోట జిల్లా గార్ల జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ బుధవారం బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టిఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల […]

Manukota, ZPTC, PONGULETI, BRS
- ఒక్కో అడుగేస్తున్న పొంగులేటి
- పక్క జిల్లాలో పట్టు కోసం ప్రయత్నం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోట (Manukota) జిల్లా గులాబీ పార్టీకి పొంగులేటి నుంచి తొలి షాక్ తగిలింది. మానుకోట జిల్లా గార్ల జడ్పిటిసి జాటోత్ ఝాన్సీ బుధవారం బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టిఆర్ఎస్ పై తిరుగుబాటు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల గార్ల మండలంలో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఈ సమ్మేళనానికి ఝాన్సీ హాజరయ్యారు.ఈ సమ్మేళనం సందర్భంగా తన కార్యాలయాన్ని ప్రారంభించారు. పొంగులేటి వైపు తాను మొగ్గుచూపటంతో నైతిక బాధ్యత వహించి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జెడ్పిటిసి గా మాత్రం తాను కొనసాగనున్నట్లు సమాచారం.
ఒక్కో అడిగేస్తున్న పొంగులేటి
గులాబీ పార్టీపై తిరుగుబాటు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక్కో అడుగు వేస్తున్నారు. బలాబలగాలను కాపాడుకుంటూ, పట్టును సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో తన ప్రాబల్యం ఉన్న ప్రాంతాలతో పాటు పక్క జిల్లా ఆయన మహబూబాబాద్ లో కూడా తన పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలోనే పాత ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్న గార్ల ప్రాంతంపై తన పట్టును పెంచుకునేందుకు ప్రయత్నం చేశారు. పొంగులేటి ప్రభావంతో ఝాన్సీ గులాబీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రస్తుతానికి ఏ పార్టీలో చేరనప్పటికీ తన బలాబలాలను, బలగాలను నెమ్మదిగా సమీకరించుకుంటున్నారు.ఏ పార్టీలో చేరుతారనేది చర్చనీయాంశంగా ఉంది. అయితే వచ్చేనెల 5వ తేదీన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
ఈ కారణంగానే తన ఎత్తుల్లో వేగం పెంచినట్లు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే తనను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలను గులాబీ పార్టీకి రాజీనామా చేయించే ప్రణాళికతో ఉన్నట్లు భావిస్తున్నారు. అధికార పార్టీ తన బహిష్కరణ కార్యక్రమం తీవ్రం చేయకముందే ఇంటికి రాజీనామా చేస్తూ, తామే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి పైచేయి సాధించేందుకు రాజకీయ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.