Mask Must | దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి చేయాలని ICMR సూచ‌న‌..!

Mask Must | కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5-10 మధ్య ఉన్నది. గత వారంలో అనేక జిల్లాల్లో 40శాతానికిపైగా నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) మహమ్మారిని నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరి […]

Mask Must | దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి చేయాలని ICMR సూచ‌న‌..!

Mask Must | కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 5-10 మధ్య ఉన్నది.

గత వారంలో అనేక జిల్లాల్లో 40శాతానికిపైగా నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. ఈ క్రమంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) మహమ్మారిని నివారించేందుకు రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయాలని సూచించింది.

దాదాపు 88 జిల్లాల్లో కొవిడ్‌ పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 500 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ 5శాతం కంటే తక్కువగానే ఉన్నది. అయితే కొన్ని రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నది. సూపర్ స్ప్రెడర్‌ను నిలువరించడం ముఖ్యమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది.

పుదుచ్చేరి, మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాల్లో ఎక్కువగా కొవిడ్‌ సోకింది. అదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలోని 11 జిల్లాల్లో మూడింటిలో సంక్రమణ 10శాతానికి పైగానే ఉన్నది. అయితే, నాలుగు జిల్లాల్లో 5-10 శాతం మధ్య ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఢిల్లీలో తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

కొత్త మ్యుటేషన్ల ఆధారంగా పెరుగుతున్న కరోనా

కరోనా మహమ్మారి తన రూపం మార్చుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ తన రూపం మార్చుకుంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్ చెప్పారు. ప్రస్తుతం కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయి. దానికి వైరస్ కొత్త మ్యుటేషన్ కారణమని పేర్కొంటున్నారు.

ఇప్పటి వరకు 14 కంటే ఎక్కువ దేశాల్లో గుర్తించారు. భారత్‌లో ఇంకా ప్రభావం మాత్రం చూపలేదు. అయితే, ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని నిపుణులు పేర్కొంటున్నారు. కొవిడ్‌ నియమాలను అనుసరించడం ద్వారానే ఇన్‌ఫెక్షన్లను ఆపవచ్చని పేర్కొంటున్నారు.

ఇదిలా ఉండగా.. దాదాపు ఐదు నెలల తర్వాత భారత్‌లో ఆదివారం 24 గంటల్లో 1,890 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దాంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,433కు పెరిగింది. మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో ఆరుగురు మరణించారు.