విశాఖ జాలరీ పేటలో అగ్ని ప్రమాదం
ఏపీలోని విశాఖపట్టణంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ జిల్లా జాలరి పేట ప్రాంతంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది.

- అగ్నికి ఆహుతైన మత్స్యకారుల చెక్క పెట్టెలు
- విశాఖలో పక్షంలో రోజుల్లోనే రెండో ప్రమాదం
విధాత: ఏపీలోని విశాఖపట్టణంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ జిల్లా జాలరి పేట ప్రాంతంలో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. మత్స్యకారులకు చెందిన పలు చెక్క పెట్టెలు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే మత్స్యకారుల కలప పెట్టెలను చుట్టుముట్టాయి.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదు. ఎవరికీ గాయాలు అయినట్టు కూడా తెలియ రాలేదు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ హార్బర్‌లో ఇటీవల భారీ అగ్నిప్రమాదం సంభవించి మత్స్యకారులకు చెందిన 40-50 బోట్లు పూర్తి కాలిపోయాయి. తాజాగా జాలర్ల చెక్క పెట్టెలు అగ్నికి ఆహుతయ్యాయి. పక్షంలో రోజుల్లోనే రెండో ప్రమాదం జరుగడంపై జాలర్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.