తెలంగాణలో భారీగా అక్రమ ఇన్సూలెన్ ఇంజక్షన్ల పట్టివేత
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (టీజీడీసీఏ)నిర్వహించిన దాడుల్లో న్యూఢిల్లీ డ్రగ్ హోల్‌సేల్ వ్యాపారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన ఇన్సూలిన్ ఇంజెక్షన్లను (ప్రీ-ఫిల్డ్ పెన్లు) పట్టివేసింది

విధాత, హైదరాబాద్ : తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (టీజీడీసీఏ)నిర్వహించిన దాడుల్లో న్యూఢిల్లీ డ్రగ్ హోల్‌సేల్ వ్యాపారుల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన ఇన్సూలిన్ ఇంజెక్షన్లను (ప్రీ-ఫిల్డ్ పెన్లు) పట్టివేసింది. ఇన్సులిన్ ఇంజెక్షన్లను టోకు వ్యాపారులు 40 శాతం కంటే ఎక్కువ తగ్గింపుతో విక్రయిస్తుండగా, వాటి ప్రామాణికతపై ఆందోళనలు తలెత్తుతున్నాయి. డీసీఏ మొత్తం దాడుల్లో రూ.51.92 లక్షలు విలువైన ఇన్సులిన్లను స్వాధీనం చేసుకుంది.
ఢిల్లీలోని భగవతి ఫార్మా, రామ్ గలి, ఫిల్మ్ కాలనీ, భగీరథ్ ప్యాలెస్, న్యూఢిల్లీలోని రాయల్ డ్రగ్స్, భగీరథ ప్యాలెస్ ద్వారా బిల్లులు లేకుండా అక్రమంగా ఇన్సూలిన్ ఇంజెక్షన్లను సరఫరా చేసినట్లు హోల్ సేల్ వ్యాపారులను విచారించగా తేలింది. కొనుగోలు బిల్లులు లేకుండా చట్టవిరుద్ధంగా మందులను సేకరించడం, అమ్మడం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 ఉల్లంఘనగా పరిగణిస్తూ కేసులు నమోదు చేశారు.