బీఆరెస్‌తో పొత్తుకు మాయవతి గ్రీన్‌ సిగ్నల్‌.. ఆరెస్పీ వెల్లడి

ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమిలో లేనందునా బీఎస్పీ ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి బీఎస్పీ

బీఆరెస్‌తో పొత్తుకు మాయవతి గ్రీన్‌ సిగ్నల్‌.. ఆరెస్పీ వెల్లడి

విధాత, హైదరాబాద్‌ : ప్రస్తుతం బీఆరెస్ పార్టీ దేశంలో ఏ కూటమిలో లేనందునా బీఎస్పీ ఆ పార్టీతో పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి బీఎస్పీ చీఫ్‌ మాయవతి అనుమతించారని పార్టీ హైకమాండ్‌ వెల్లడించినట్లుగా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఆరెస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. బీఆరెస్‌-బీఎస్పీ పొత్తుపై ఏర్పడిన సందిగ్థతకు మాయవతి కొద్దిసేపటి క్రితమే తెరదించారని ఆరెస్పీ తెలిపారు. బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో త్వరలోనే బీఎస్పీ పొత్తు, సీట్ల సర్ధుబాటుపై చర్చించేందుకు మాయవతి ప్రతినిధిగా పార్టీ కేంద్ర సమన్వయకర్త రాంజీ హాజరుకానున్నట్లుగా తెలిపారు. ఇదే విషయాన్ని ఆరెస్పీ ట్విటర్‌ ఎక్స్‌లో కూడా పేర్కోన్నారు.