Medak | రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధిగా.. పల్లె రాంచందర్ గౌడ్ నియామకం

Medak | ఉత్తర్వులు ఇచ్చిన పీసీసీ అసోసియేట్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విధాత, మెదక్:బ్యూరో: మెదక్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామాయంపేట మాజీ సర్పంచ్ పల్లె రాంచందర్ గౌడ్‌ను పీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర పీసీసీ అసోసియేట్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మెదక్ డీసీసీ కార్యాలయంలో  అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి నియామక ఉత్తర్వులను రాంచందర్ గౌడ్‌కు అందజేశారు. ఈ […]

  • By: krs    latest    Sep 12, 2023 12:15 PM IST
Medak | రాష్ట్ర పీసీసీ అధికార ప్రతినిధిగా.. పల్లె రాంచందర్ గౌడ్ నియామకం

Medak |

ఉత్తర్వులు ఇచ్చిన పీసీసీ అసోసియేట్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

విధాత, మెదక్:బ్యూరో: మెదక్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామాయంపేట మాజీ సర్పంచ్ పల్లె రాంచందర్ గౌడ్‌ను పీసీసీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర పీసీసీ అసోసియేట్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మెదక్ డీసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు కంటా రెడ్డి తిరుపతి రెడ్డి నియామక ఉత్తర్వులను రాంచందర్ గౌడ్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డితో పాటు నాయకులు రాంచందర్ గౌడ్‌ను శాలువాతో సత్కరిచారు. ఈ సందర్భంగా రాంచందర్ గౌడ్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పార్టీ అధికార ప్రతినిధిగా నియామకానికి సహకరించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ది కృషిచేస్తానని అన్నారు.