Medak | BRS మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది: తిరుపతి రెడ్డి
Medak కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షులు విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం చౌట్లపల్లి, శుక్లల్ పేట్, తొగుట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలు, రైతులతో కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు. వారి సాధక బాధకాలను తెలుసుకొని పాలన ఏ విధంగా ఉన్నదనే విషయాలపై ప్రజలతో […]

Medak
- కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్
- కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షులు
విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం చౌట్లపల్లి, శుక్లల్ పేట్, తొగుట గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పెద్దలు, రైతులతో కలిసి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు. వారి సాధక బాధకాలను తెలుసుకొని పాలన ఏ విధంగా ఉన్నదనే విషయాలపై ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలనే పేరుతో తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే మా గ్రామానికి చుక్క నీరు మిషన్ కాకతీయ ద్వారా వచ్చింది లేదని మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదని మన సంపదంత దోచుకుని పోయి కేసీఆర్ కుటుంబం బాగుపడిందే తప్ప మా గ్రామానికి గాని, మన ప్రాంతానికి గాని ఏమీ ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్ ఇస్తున్నానని చెబుతూనే ఒకవైపు నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెంచారని అదంతా గ్రహిస్తున్నామని తగిన సమయం కోసం చూస్తున్నామని ఎలక్షన్ రాగానే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కొంత మంది తాము ఇండ్లు నిర్మించుకున్నామని, 9 సంవత్సరాల నుండి మా గ్రామానికి ఒక్క ఇల్లు కూడా రాలేదని కాంగ్రెస్ పాలననే బాగుందని మళ్లీ ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ పాలన రావాలని కోరుకుంటున్నామన్నారు.
వచ్చే ఎలక్షన్లో టిఆర్ఎస్ పార్టీకి గుణపాఠం చెప్తామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని మీరందరూ వచ్చి మా యొక్క సమస్యలు వినాలని మీ ద్వారానే సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదని సోనియమ్మ దయ వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాలేశ్వరం పేరు చెప్పి లక్ష కోట్లు అవినీతి చేశారని కమీషన్ల రాజ్యంగా మారిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, ఇప్పుడు ఇస్తున్న రెండు వేల పెన్షన్ 4000 పెంచుతామని అదేవిధంగా డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని, చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.
ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ 500 కే ఇస్తామని, వరి పంటకు మద్దతు ధర కలిపి 2500 చేస్తామని తెలియజేశారు. ఆయన వెంట పిసిసి సభ్యులు మామిళ్ల ఆంజనేయులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పల్లె రామచంద్ర గౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, మండల అధ్యక్షులు లక్కర్స్ శ్రీనివాస్, మెదక్ టౌన్ అధ్యక్షులు గూడూరు ఆంజనేయులు గౌడ్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు ప్రేమ్ కుమార్, మహేష్, బాబు, ప్రకాష్ నారాయణ, అర్జున్, పోచయ్య, ఇతరులు ఉన్నారు.