Medak | శుభకార్యానికి వెళ్లొస్తూ.. అనంతలోకాలకు! రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
Medak | లారీ, కారు ఢీ ఇద్దరు మృతి శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం. విధాత: మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివునూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై లారీ కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత, చిన్నశంకరంపెట్ ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి కూతురు వివాహ […]

Medak |
- లారీ, కారు ఢీ ఇద్దరు మృతి
- శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం.
విధాత: మెదక్ బ్యూరో: మెదక్ జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శివునూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై
లారీ కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత, చిన్నశంకరంపెట్ ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి కూతురు వివాహ విందు రామాయణం పేటలో ఆదివారం సాయంత్రం జరిగింది. ఈ విందుకు హాజరైన బంధువులు రామాయంపేటకు కారులో బయలుదేరారు. కారు శివునూరు గ్రామ శివారులో ఏ దురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపెట్ గ్రామానికి చెందిన తెరాస నేత సరికొండ లింగారెడ్డి, 56 సిద్దిపేట జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన ముత్యాల వేంకట రమణారెడ్డి 50లు మృతి చెందారు. కారు నడుపుతున్న పెంటపర్టి బాపురెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. నార్శింగి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.